చిన్నప్పుడు ప్రైమరీ స్కూలు గోడలపైన “భూత దయ కలిగి ఉండవలెను” లాంటివి రాసి ఉండేవి. భూతాల మీద మనం ఎందుకు దయ చూపించాలో అర్థం కాలేదు. అడిగితే జంతువుల పట్ల జాలి చూపించడం అన్నారు. ‘భూత’ అంటే ‘ప్రాణి’ అన్న అర్థం తెలియదు అప్పుడు. సాటి మనుషులపైన, పశువులు, చెట్లు, పంచ భూతాలనబడే గాలి, నీరు వగైరాలన్నిటి పట్ల ప్రేమ, కరుణ, దయ కలిగి ఉండాలని అప్పుడు తెలియదు. అవన్నీ ప్రాణులుగా భావించ బడ్డాయి హిందూ మతంలో. అది మనం పాటించి ఉంటే నేడు సమస్యలుగా మారిన జల, వాయు, శబ్ద వగైరా కాలుష్యాలు ఉండేవి కాదేమో.
Also read: “దీపావళి”
జంతు బలుల పట్ల విముఖతతో ‘అహింస’ అన్న బౌద్ధం కంటే హిందూ మతం చెప్పే ‘భూతదయ’ మరింత లోతైన కారుణ్య భావన.
Also read: “సింధువు”
దయ, కరుణ, సానుభూతి, అహింస, ప్రేమ అన్నీ పర్యాయ పదాలే. భక్తి కూడా దేవుడిపై ఇష్టమేగా.
Also read: “హంతకులు”