Thursday, November 21, 2024

ఇంకా ఎంత మంది బాబాల మోసాలకు బలికావాలి?

ఫోటో రైటప్: కేరళ నరబలి కేసులో నిందితులు. షఫీ అనేవాడు ఒక దొంగ బాబా. కామాంధుడు. 75 ఏళ్ళ మహిళను చెరిచిన రాక్షసుడు. తక్కిన ఇద్దరు దంపతులు. ఆర్థిక కష్టాలు తీర్చుకోవడానికి నరబలికి తెగించినవారు

కేరళ నరబలి ఘాతుకం ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలి

బాబాల గుట్టు రట్టు చేసి అమాయకులు బలికాకుండా కాపాడాలి

ప్రభుత్వాలు ఇప్పటికయినా బుద్ది తెచ్చుకొని బాబాల ఆశ్రమాలపై దృష్టి పెట్టాలి.

బాబాలు ఏమిచేస్తున్నారు?

వారు ఏమిభోధిస్తున్నారు?

ఆశ్రమాలలో ఏమిజరుగుతోంది?

ఫ్రభుత్వం వెంటనె నేరాలకు నిలయాలైన బాబాల అశ్రమాల గుట్టు రట్టు చెయ్యాలి.

Also read: రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న కెసిఆర్

కేరళలో నరబలి ఇస్తే సంపద పెరుగుతుందని ఒక బాబా రాస్కెల్ చెపితే ఇద్దరు మహిళలను ముక్కలుచేసి వండుకొని తినే సమాజంలో మనం ఉన్నామంటే చాలా చాలా సిగ్గుపడాలి.

కేరళలో భగవత్ సింగ్ అనేబాబా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక కుటుంబాన్ని నమ్మించి నరమాంసం తింటే ఇబ్బందులు తొలగి పోతాయని గత జూన్ 8 న పద్మ అనేమహిళను , సెప్టెంబర్ 26 న రొస్లే అనే మహిళను ముక్కలు చేసి ముగ్గురు వ్యక్తులు తిన్నారంటే 75 ఏళ్ళ స్వతంత్రంలో , మన పాలకులు ప్రజలకు నేర్పింది ఇదేనా అని అనిపిస్తుంది.

ఇదేవిధంగా దేశంలొ నిత్యం నరబలులు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి .

Also read: పాత పునాదులను తొలగించి పటిష్టంగా నవసమాజ నిర్మాణం

మదనపల్లిలో ఇద్దరు బాలికల హత్యలో ఒక బాబా ప్రేరణ ఉంది. కేరళలోనే ఒక మహిళ ఆ మద్య తన కుమారుణ్ణే దేవుని బలి ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలొ ఆ మద్య యేసుప్రభు పిలుస్తున్నాడంటూ, ఒక ఫాస్టర్ ప్రేరణతో ముగ్గురు మహిళలు ఉరివేసుకుని చనిపోయారు.

ఈ మద్య తమిళనాడులో ఒక ఉన్మాది అత్మను చూడాలంటూ, ఈ విధంగా చేస్తే ఆత్మ కనిపిస్తుందని చదవగా కొడుకుని,  భార్యను చంపాడు.

Also read: బన్నీ ఉత్సవాలు ఆపుచేయాలి

కొంతకాలం కిందట నాయుడుపేట వద్ద వెలసిన వాసమ్మ అనే దొంగబాబా

ఒక యువకుడిని నీజాతకం చెప్తానంటు, ఆయువకునిపై అనైతిక

చేష్టలు చేయగా,ఆ బాబాను అరెస్టు చెశారు.

బాబాలందరు దొంగలే! డేరాబాబా, ఆశారాం బాపూ, రాంపాల్ బాబా… అందరూ బెయిల్ కూడాలేకుండా జైల్లలో మగ్గుతున్నారు.

ఇంకాఎంతమంది బాబాల మోసాలకు బలికావాలి?

ఈ రకంగా ఇంకా ఎంతమంది మూఢ నమ్మకాలకు బలికావాలి?

ఫ్రభుత్వం తక్షణమె బాబాల గుట్టు రట్టు చేసే విధంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

Also read: ఇదో వెర్రి ఆనందం

నార్నెవెంకటసుబ్బయ్య,

 అద్యక్షుడు, AP హేతువాద సంఘం

Venkatasubbaiah
Venkatasubbaiah
Venkatasubbaiah is a rationalist who is president of AP Rationalists Association. He had also worked as Assistant Secretary of National Rationalists Association for ten years. 72-year-old Venkatasubbaiah from Prakasham district has been very active for more than four decades exposing fake swamies and irrational things.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles