- దేవస్థానం బోర్డు విజ్ఞప్తిని తిరస్కరించిన కేరళ సర్కార్
- 5వేలకు మించి భక్తులను అనుమతించమన్న ఆరోగ్య శాఖ
శబరిమల ఆలయానికి భక్తుల రాకపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు ప్రస్తుతం రోజుకు 5 వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. కుంభమాసం ప్రత్యేక పూజల నిమిత్తం ఈ నెల 12న శబరిమల ఆలయం తెరుచుకోనుంది. కుంభమాస పూజ నిమిత్తం భక్తుల సంఖ్యను 5 వేలనుంచి 15 వేలకు పెంచాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కరోనా మహమ్మారి దృష్ట్యా పరిస్థితులను అంచనావేసిన నిర్ణయం తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించించింది.
కరోనా మహమ్మారితో శబరిమల ఆలయానికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నష్టాన్ని కొంతైనా పూడ్చుకునేందుకు ఎక్కవ సంఖ్యలో భక్తులను అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆలయంలోకి ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తే మళ్లీ కరోనా విజృంభించే అవకాశముందనే హెచ్చరికల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేవస్వం బోర్డు విజ్ఞప్తి మేరకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమై బోర్డు విజ్ఞప్తిపై కూలంకషంగా చర్చించిన అధికారులు ఆలయ దర్శనానికి ఎక్కువమంది భక్తులను అనుమతించేదిలేదని తేల్చిచెప్పింది. ఇప్పటికే 5 వేల మందిని అనుమతిస్తున్నామని అంతకుమించి అనుమతించితే కరోనా వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.
Also Read: కరోనా ప్రపంచానికి నేర్పిన సంస్కారం మన నమస్కారం
కరోనా విజృంభణ నేపథ్యంలో గతంలో ప్రతిరోజు 2 వేలమందిని శని, ఆదివారాల్లో 3 వేల మంది భక్తులను అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రోజువారీ భక్తుల సంఖ్యను 5 వేలకు పెంచుతూ గత సంవత్సరం డిసెంబరులో కేరళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.