ఉద్యమ నేత నుండి పాలనాదక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు రూపొందించి, యావత్ దేశాన్నీ తన వైపు తిప్పుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అచరించే ప్రభుత్వ పథకాలన్నింటిని దేశం అచరించే విధంగా ప్రజధారణ పొందాయని అన్నారు. బుధవారం నాడు మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరిశంకర్ రచించిన ‘KCR The Man of Millions’ (కెసీఆర్ ది మ్యాన్ అప్ మిలియన్స్) పుస్తకాన్ని అవిష్కరించారు. కెసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఈ పుక్తకాన్ని అవిష్కరించారు. పాలనా రంగంలో దేశంలో బలమైన ముద్రను ముఖ్యమంత్రి కెసిఆర్ వేశారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్ర సాధనకు కెసిఆర్ అనేక చిక్కులను ఎదుర్కొన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు అద్భుతమైన పాలన అందించారని తెలిపారు. కెసిఆర్ ఇచ్చిన పథకాలు, పరిపాలనా సంస్కరణలు గురించి దేశమంతా చర్చిస్తామని అన్నారు. గత 60 సంవత్సరాల సాంప్రదాయ పాలనకు భిన్నంగా దార్శనికతతో గొప్ప పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ పుస్తకం ‘దటీజ్ కేసీఆర్’ అనే తెలుగు పుస్తకాన్ని దామోదరాచారి ‘ది మాన్ ఆఫ్ మిలియన్స్’ పేరుతో ఆంగ్లంలో అద్భుతంగా అనువదించారని తెలిపారు. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమాన్ని, నాటి ముఖ్య ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారని మంత్రి తెలిపారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, సమాచార కమిషన్ చైర్మన్ బుద్ధ మురళి, సభ్యులు కట్టాశేఖర్ రెడ్డి, నారాయణరెడ్డి,టి ఎస్ పి ఎస్ సి తొలి చైర్మన్ ఘంటా చక్రపాణి, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద పటేల్, రామానంద తీర్థ గ్రామీణ యూనివర్సిటీ డైరెక్టర్ కిషోర్ రెడ్డి, అధికారులు సాయన్న, బాలాచారి,,హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయా చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు