- అవకాశవాద రాజకీయాలకు తెలంగాణ ప్రజలు మోసపోరు
- కాంగ్రెస్ మద్దతుతో అధికారంలో ఉన్న ఠాక్రేని కలుసుకోవడంలో ఆంతర్యం ఏమిటి?
ముఖ్యమంత్రి కేసీఆర్ మహరాష్ట్ర పర్యటనలో ఉన్న అవకాశవాద రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజలు మోసపోరని ఒబిసి మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ మహరాష్ట్ర పర్యటన ఏం సందేశం ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రేస్, బిజెపియేతర కూటమి కట్టి దేశరాజకీయంలో చక్రం తిప్పుతామని చేప్పి ,ఇప్పుడు కాంగ్రేస్, ఎన్సీపీ మద్దతుతో కొనసాగుతున్న శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేను కలిశారంటే దిని పరమార్ధం ఏమిటని ప్రశ్నించారు. ఒక వైపు కాంగ్రెస్ తో దూరం ఉంటానని చేప్పి, రాజకీయలు చేస్తామనిచేప్పి ఇప్పుడు కాంగ్రెస్ ను సమర్ధించే పార్టీలతో జతకట్టడం ఏమిటన్నారు. హిందూత్వ ఎజెండాతో కొనసాగుతున్న శివసేన పార్టీ మహరాష్ట్రలో ప్రభుత్వం నడుపుతోంది. అక్కడ శివసేనతో జతకట్టారు. మరోవైపు తెలంగాణలో మతోన్మద మజ్లీస్ పార్టీతో అధికారం పంచుకుంటు జిహెచ్ఎంసీలో రాజకీయాలు నడుపుతూ ఎవరిని మోసం చేయ్యలని చూస్తూన్నరని మండిపడ్డారు. కాంగ్రేసేతర, బిజెపియేతర పార్టీలకు కూటమి కట్టి రెండింటికి దూరంగా ఉంటామనిచేప్పిన కేసీఆర్ నీజంగా బిజెపి మీద, రాజకీయం మీదా పోరాటం కొసమా? లేదా శరణం కొసమా అన్నారు. మహరాష్ట్రలో ఈరోజు శరద్ పవార్ ను,ఉద్దవ్ ఠాక్రేను అశ్రయించింది ప్రజలు అర్ధం చేసుకుంటారని అన్నారు. కెసీఆర్ అవకాశవాద రాజకీయలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోరని లక్ష్మణ్ స్పష్టం చేశారు.