- ముఖ్యమంత్రి ఉలిక్కిపాడుతున్నారు
- అప్రజాస్వామిక పాలన
- తల్లిని, బిడ్డని వేరు చేశారు
- అసెంబ్లీ, సచివాలయం వ్యవస్థలను నామమాత్రంగా చేశారు
- గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ధ్వజం
ప్రస్తుతం గజ్వేల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనను చూచి ఉలిక్కి పడుతున్నారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. కేసీఆర్ పై తాను కోపంతో ఇక్కడికి రాలేదన్నారు. ఐతే గజ్వేల్ ప్రజలు కేసీఆర్ పై కోపంగా ఉన్నారని మాత్రం గట్టి చెప్పగలని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Also read: గజ్వేల్ లో హోరా హోరీ, కేసీఆర్ వర్సెస్ ఈటల!
తన ఓటమి గుర్తు చేసుకుని ఉలికిపాటుకు గురౌతున్న కేసీఆర్ ఇక శాశ్వతంగా ఫామ్ హౌస్ లో మనుమడితో ముచ్చట్లుతో గడపవచ్చని ఈటల సూచించారు.తెలంగాణ లో అప్రజాస్వామిక పాలనను సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయాని ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు.
Also read: పవర్ కోసం పవర్ పై ఫోకాస్
రైతుల ఊసురు తప్పదు
సాగునీటి ప్రాజెక్ట్ ల భూసేకరణలో కేసీఆర్ మానవత్వం చూపించలేదని అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులకు అన్యాయం జరిగిందని అందుకు వారి ఊసురు తప్పదని ఆయన చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో కనీసం 25వేల మంది రైతులను అడ్డా కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఆయన ఆగ్రహం వ్యకం చేసారు.
అల్లుడు హరీష్ ను కేసీఆర్ బచాయించేశారు
కేసీఆర్ హరీష్ ని కూడా పార్టీలో ఉండనినిచ్చేవాడు కాదని అల్లుడు కాబట్టి బచాయించాడన్నారు. నేను బయటవాణ్ణి కాబట్టి నన్ను బయటికి నెట్టేశారని అన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగు నీరు వస్తుందని రైతులు ఆశయపడ్డారని, చివరకు ఆ ప్రాజెక్టు కుంగిపోందని అయన ఏద్దేవా చేసారు. హుజురాబాద్ లో నన్ను ఓడించడానికి దళిత బంధు తీసుకొచ్చాడని అన్నారు. ఐతే గజ్వేల్ లో దళిత బంధును ఎందుకు పూర్తి చేయలేదన్నారు.
ఉద్యోగాలు ఖాళీ
ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు కేసీఆర్ కు తెలిసే జరిగాయాన్నారు. పరీక్ష పత్రాలన్నీ లీక్ కావడానికి ముఖ్యమంత్రి అసమర్థతను గుర్తు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ పాలనలో కొలువులు ఖరీదుకు కొనుక్కొనే పరిస్థులకు రావడం చుస్తే అవినీతి ఎంత పెరింగిందో తెలిసి పోయిందన్నారు.
Also read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ముస్లిలు!
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ మంత్రం ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఈటల తూర్పార పట్టారు. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ తప్పా తెలంగాణ ప్రజలు కాదన్నారు. 2014లో తెలంగాణ తెచ్చామని ఓట్లు అడిగారని, 2018లో కొత్త సంసారమని, ఇప్పుడు మాత్రం హామీలు అమలు చేస్తానని మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నారని అయన ధ్వజం ఎత్తారు. దేశంలో తెలంగాణ 9వ స్థానం లో ఉన్న సంగతి జాతీయ గణంకాలు గుర్తు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం తెలంగాణ మొదటి స్థానం లో ఉందని చెప్పడం సిగ్గు చేటు అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఓటమి లేదన్నారు. నా గెలుపునకు శ్రమను నమ్ముకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. గజ్వేల్ ప్రజలపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. తాను ఎన్నికల ప్రచారం చేస్తుంటే ప్రజలు స్వచ్చందంగా స్వాగతం పలకడంతో విజయం పట్ల మరింత విశ్వాసం పెరింగదన్నారు. కేసీఆర్ పై తెలంగాణ యువతకు నమ్మకం పోయిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ కు మంచి రోజులు వస్తాయని ఆయన గట్టి విశ్వాసం వ్యక్తం చేసారు