రైటప్:తెలంగాణ జర్నలిస్టుల అధ్యన వేధిక బోదనపల్లి వేణుగొపాల్ రెడ్డి.ప్రధాన కార్యదర్శి సాదిక్, మధ్యలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం కేటీఆర్ నే
- భూమి కోసం విప్లవం వచ్చిన ఏకైక ప్రాంతం తెలంగాణ.
- తెలంగాణ సాయుధ పోరాటాలు ప్రపంచం మరిచిపోదు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 81 ప్రాజెక్టులను నిర్మాణం తలపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
- మనిషి లక్షణం తెలుసుకోవాలంటే DNA ఎలాగో..భూమి లక్షణం తెలుసుకోవాలంటే DNA అవసరం.
- రైతుకు మద్దతు ఇవ్వడానికి పాలసీలు తెచ్చిన పార్టీ కాంగ్రెస్.
- రైతులను దోపిడీ చేస్తున్న వివాదానికి అడ్డుకట్ట వేసే చట్టాలు తెచ్చిన పార్టీ కాంగ్రెస్.
- ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాల తీయించారు.
- 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇప్పుడున్న అభివృద్ధి అంతా ఆనాడు చేసిందే
- 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 69వేల కోట్లు అప్పు చేస్తే…కేసీఆర్ 7 ఏళ్ల పాలనలో 5లక్షల కోట్లు చేశారు.
పన్నేండునెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ,కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్ వందశాతం అమలు చేస్తామని పిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు డిక్లరేషన్ అమలు చేసే టీపీసీసీ అధ్యక్షుడుగా ఆ భాద్యత తీసుకుంటాని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే 2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతుబంధు ధనికులకు అవసరం లేదన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్నా రైతులు పట్టాలు ఇవ్వడమేకాక వారికి భూమిపై హక్కులిస్తామని అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్వర్యంలో ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ సాధ్యాసాధ్యాలపై మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ ను అమర వీరు స్థూపం వద్ద ఎకే 47 తో కాల్చినా తప్పులేదని అగ్రహం వ్యక్తం చేశారు. పంటలను భీమా ఇచ్చే బదులు రైతు చనిపోతే 5 లక్షల భీమా ఇస్తామాని దుర్మర్గం కాదా అని నిలదీశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాల తీయించారని ఆరోపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 69 వేల కోట్లు అప్పు చేస్తే…కేసీఆర్ 7 ఏళ్ల పాలనలో 5లక్షల కోట్లు చేశారని గుర్తు చేశారు. శ్రీలంక పరిస్థితి తెలంగాణలోనూ వస్తుందన్నారు. శ్రీలంక అధ్యక్షుడిపై దాడి ఘటనలు తెలంగాణలో కూడా వస్తాయన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రైతు విప్లవాలను కేసీఆర్ ధ్వంసం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో చెరుకు, కందులు, పత్తి, మాయమైందని, వరికి మాత్రమే రైతులు పరిమితం అయ్యారని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యత గా రైతు డిక్లరేషన్ తీసుకున్నామని, రానున్న రోజుల్లో వైద్యం, విద్య, నిరుద్యోగతపై డిక్లరేషన్స్ కూడా ఉంటాయని తెలిపారు.భూమి కోసం విప్లవం వచ్చిన ఏకైక ప్రాంతం తెలంగాణ అని అందుకే తెలంగాణ సాయుధ పోరాటాలు ప్రపంచం మరిచిపోదన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 81 ప్రాజెక్టులను నిర్మాణం తలపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నరు.రైతుకు మద్దతు ఇవ్వడానికి పాలసీలు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. మీట్ ది ప్రెస్ తెలంగాణ జర్నలిస్టుల అధ్యన వేధిక బోదనపల్లి వేణుగొపాల్ రెడ్డి.ప్రధాన కార్యదర్శి సాదిక్ పాల్గోన్నారు.