- నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో కేసీఆర్, రేవంత్ పరస్పర సవాళ్లు
- ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన రేవంత్
24 గంటలు ఉచిత విద్యుత్ పై కామరెడ్డి చేరస్తా లో కేసీఆర్ పై రేవంత్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే విద్యుత్ పై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు రేవంత్ ఘాటుగా సవాల్ చేసారు తెలంగాణ లో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డి లో తన నామినేషన్లు ఉపసంహారించుకుంటానని రేవంత్ కేసీఆర్ కు సవాళ్లు విసిరారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపించకపోతే కేసీఆర్ తన ముక్కు నేలకు రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేడి రాజేశారు.
విద్యుత్ పై చర్చకు కామారెడ్డికి వస్తావా లేక గజ్వెల్, సూర్యాపేటకు విద్యుత్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తో పాటు కేసీఆర్ రావాలని రేవంత్ సవాళ్లు చేశారు. 24 గంటలు విద్యుత్ సరఫరా తెలంగాణలో అమలు అవుతున్నదా లేదా అన్న చర్చకు ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో తెలంగాణ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు
ఆగని వలసలు
ప్రధాన పార్టీలు బీఅర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోకి వలసలు పరంపర సాగుతున్నాయి. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు కావడంతో ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత పది సంవత్సరాలనుండి అధికారనికి దూరంగా వున్న కాంగ్రెసులో ఆశా వహులు ఎన్నికల్లో రెబెల్స్ గా నామినేషన్లు దాఖలు చేశారు. రెబల్స్ ను ఉపసంహరింపజేయడానికి కాంగ్రెస్ నేతలు బుజ్జగింపుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు