Friday, January 3, 2025

రైతులను గాలికి వదిలేసిన కేసీఆర్ : మధు యాష్కీ

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ ప్రచార సారథి మధుయాష్కీ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ హుజురాబాద్ ఓట్ల కొనుగోలు లో బిజీ గా ఉంది రైతులను గాలికి వదిలేశారనీ, కేసీఆర్ రాష్ట్ర దోచుకొని కేంద్రానికి కప్పం కడుతున్నారనీ, ప్రజలు ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం పై తీరగబడాలనీ మధు యాష్కీ అన్నారు.

టీఆరెఎస్, బీజేపీ లు  మిల్లర్ల తో కుమ్ముక్కు అయ్యి రైతులను దొచుకున్నారనీ, రైతులను వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ .. తన ఫామ్ హౌస్ లో ఎలా వరి పంటను వేస్తారని అడిగారు. రైతులు యాసంగిలో వరి పంట వేసుకోవాలనీ,

ప్రభుత్వం ఎలా కొనదో చూద్దామనీ, కాంగ్రెస్ రైతులకు అండగా ఉంటుందనీ, వారి తరఫున పోరాడుతుందని మధు యాష్కీ హామీ ఇచ్చారు.

 బీజేపీ, టీఆర్ఎస్ మిలాఖత్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

టీఆరెఎస్ బీజేపీ లు ముందు నుంచి కలిసే ఉన్నాయనీ, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందనీ, పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు టీఆరెఎస్  మద్దతు ఇచ్చిందనీ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సింగరేణి కాలరీస్ కు అనుకొని ఉన్న మైనింగ్ ప్రవేట్ పార్టీకి ఆప్షన్ ఇచ్చారనీ, దీనిపై టీఆరెఎస్ ప్రభుత్వం నోరు మెదపలేదనీ, తాను ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాననీ, ఆ మైన్ ను తిరిగి సింగరేణికి కేటాయించాలని కోరాననీ అన్నారు.

‘‘నా ప్రశ్నకు సంబంధిత మంత్రి లోక్ సభ లో  ఈ నిర్ణయంపై పునసమిక్షిస్తామని సమాధానం ఇచ్చారు,’’ అని ఉత్తమ్ చెప్పారు.

కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనీ, రైతులు టీఆరెఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయమనీ, వరి వేయొద్దని కేసీఆర్ మైండ్ లేకుండా మాట్లాడుతున్నారనీ, పంట మార్పిడి జరగాలంటే  దానికి రైతులను సమాయత్తం చేయాలనీ, అలా కాకుండా సడన్ గా వరి వేయొద్దని చెప్పడం అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అనీ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు.

టీఆరెఎస్ నేతలు సన్నాసులు, దద్దమ్మలు: సంపత్

టీఆరెఎస్ రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కోల్పోతుందనీ, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందనీ, టీఆరెఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు మతి తప్పి  కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారనీ, వడ్లు కొనిపిస్తాయని పోతుగాల్ల లాగా డిల్లీ పోయి తోక ముడిచి వచ్చారనీ పీసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు.

కాంగ్రెస్ పై  మతిలేని విమర్శలు మానుకొక పోతే మా కార్యకర్తలు తిరగబడతారనీ, నాలుక అదుపులో లేకుండా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే సహించేది లేదనీ,

మంత్రి నిరంజన్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనీ, కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరి వేశారు అన్న రేవంత్ రెడ్డి మాట కు కట్టుబడి ఉన్నామనీ,

దీన్ని నిరూపించేందుకు మేము సిద్ధమనీ, ఈ సవాలు స్వీకరించేందుకు టీఆరెఎస్ నేతలు సిద్దమా అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ ఫాంలో 150 ఎకరాలలో వరి : మల్లు రవి

మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్ పిచ్చి వాళ్ళు మాట్లాడినట్లు గా ఉన్నాయనీ, కాంగ్రెస్ సిద్దాంతం పై ఆధార పడి నడుస్తుందనీ, టీఆర్ఎస్ లాగా వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదనీ, మత సామరస్యం కాంగ్రెస్ సిద్దాంతమనీ, దేశం కోసం ఎప్పుడు పనిచేసే పార్టీ కాంగ్రెస్ అనీ, బీజేపీ మతతత్వ పార్టీ కానీ కాంగ్రెస్ అలా కాదనీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ లో  150 ఎకరాల్లో ఎలా వరి వేశారనీ, అది మేము చెబితే మమ్మల్ని పోలీస్ లతో అడ్డుకున్నారనీ, కేసీఆర్ వరి వేస్తే తప్పేముందని మంత్రి నిరంజన్ రెడ్డి చెబుతున్నారనీ, మరి రైతులను ఎందుకు వరి వేయొద్దని చెప్పారనీ మల్లు రవి ప్రశ్నించారు.  కాంగ్రెస్ జనవరి 9 నుంచి నిరుద్యోగ రచ్చబండ కార్యక్రమం చేపడుతుందని రవి ప్రకటించారు.

ఉద్యమకాలంలో కేసీఆర్ దొంగ దీక్ష అని ఇప్పుడే తెలిసిందా :బీజేపీకి  పొన్నాల లక్ష్మయ్య ప్రశ్న

కేసీఆర్ ఉద్యమ దీక్ష దొంగ దీక్ష అని బీజేపీ కి ఇప్పుడు గుర్తుకి వచ్చిందా  అని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీజేపీని ఎద్దేవా చేశారు.

బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తామని బీజేపీ చెప్పడం హాస్యాస్పదమనీ, విభజన చట్టం హామీలను కేంద్రం ఎంతవరకు అమలు చేసిందనీ,

దీని గురించి రాష్ట్ర బీజేపి నాయకులు ఎందుకు మాట్లాడరనీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచాలను కొవవడం సరికాదనీ లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై నేను బయట మాట్లాడబోనని లక్ష్మయ్య స్పష్టం చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles