- ఉపఎన్నిక ప్రచారానికి శ్రీకారం
- ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కార్యకర్తల సమీకరణ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా హాలియాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దుబ్బాక ఓటమి భారం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను కూడా రాబట్టకపోవడంతో కేసీఆర్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో సాగర్ ఉపఎన్నికను కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నోముల నర్శింహయ్య మరణంతో సాగర్ లో ఉపఎన్నిక అనివార్యమవడంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ గట్టిగా కృషిచేస్తోంది. మరోవైపు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి ఊపుమీద ఉన్న బీజేపీ సాగర్ లో గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Also Read: కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?
త్వరలో సాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయకుండానే పార్టీ తరపున కేసీఆర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి పరువుకాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం హాలియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. దాదాపు వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజవకర్గాల నుంచి భారీ సంఖ్యలో జససమీకరణ చేయనున్నారు.
సభను అడ్డుకుంటామంటున్న బీజేపీ:
మరోవైపు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నేరవేర్చనందున హాలియా సభను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
Also Read: ఇష్టంలేకుండానే కొనసాగుడా…?