Wednesday, January 22, 2025

పెట్రోల్ పై వ్యాట్ పెంచలేదు, తగ్గించేది లేదు: కేసీఆర్

  • పెట్రోల్ ధరలు తగ్గించాలని ఉద్యమం చేస్తాం
  • అగ్గపెడతాం, ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు
  • దమ్ములుంటే నన్ను టచ్ చేసి చూడండి
  • ఉత్తరాది రైతు ఉద్యమానికి ఊతం ఇస్తాం

‘‘పెట్రోల్ డీజిల్ పై మేము వ్యాట్ తగ్గించం. ఒక్క రూపాయి కూడా తగ్గించం. మేము వ్యాట్ పెంచలేదు- అందుకే తగ్గించం. పెట్రోల్ డీజిల్ పై సెస్ రద్దు చేయాలని మేమే పోరాటం చేస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం అడ్డదారిలో, దొడ్డిదారిలో పెంచింది. పెట్రోల్- డీజిల్ ధరలు పెంచడమే తప్పు. పెరగని అంతర్జాతీయ క్రూడాయల్ ధరలు పెరిగినట్లు కేంద్రం దేశ ప్రజలను మోసం చేసింది. 77 రూపాయల నుంచి 114 రూపాయలు  పెట్రోల్, 66 నుంచి 104 రూపాయలు డీజిల్ పెంచారు. సెస్ రూపంలో రాష్ట్రాల వాటా ఇవ్వకుండా రాష్ట్రాలను కేంద్రం మోసం చేసింది. పెంచింది కొండంత- తగ్గించింది పిసరంత. పెట్రోల్ ధరల పెంపు వల్ల ప్రతి వస్తువు ధర పెరిగింది,’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖరరావు (కేసీఆర్) ఆదివారంనాడు ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో ప్రకటించారు.‘‘కేంద్రం సెస్ విత్ డ్రా చేసుకోవాలి. 2014 లో ఎంత వ్యాట్ ఉందొ ఇప్పటికీ అంతే రాష్ట్రంలో ఉంది. కేంద్రం అడ్డం పొడవు ఎట్లా వీలైతే అట్లా మాట్లాడుతోంది. పెట్రోల్- డీజిల్ పై కేంద్రం సెస్ రద్దు చెయ్యాలి. సెస్ రద్దు చేస్తే 77 రూపాయలకు పెట్రోల్ వస్తది,’’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ పై సెస్ రద్దు చేయాలని మేమే పోరాటం చేస్తామంటూ కేసీఆర్ హెచ్చరించారు.

రైతుల పట్ల బాధ్యత విస్మరించిన కేంద్రం

‘‘ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చెబుతోంది. కల్తీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గతంలో పోలీస్ స్టేషన్స్ లలో ఎరువుల బస్తాలు పెట్టి అమ్మిన ఘనత మనం చూశాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం మా లక్ష్యం. ఇండియాలో ఏ రాష్ట్రానికి లేనట్టు వ్యవసాయానికి 24గంటలు కరెంట్ ఇచ్చాము. ఇండియాలో రైతుబంధు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం రాష్ట్రాలకు కాలుకు పెడితే మెడకు- మెడకు పెడితే రాష్ట్రానికి పెడుతోంది. ధాన్యం నిల్వ ఉంచాలంటే అది కేవలం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గరే అధికారం ఉంటది. పంట మార్పిడి చేయమని కేంద్రమే నాకు స్వయంగా చెప్పింది. ప్రజలకు ఆహారకొరత రాకుండా చూసే భాద్యత కేంద్రంది. ధాన్యం ఎగుమతి చేయాలన్న- విత్తనాల మార్పు చేయాలన్నా కేంద్రంపై ఉంది. కేంద్రం తమ బాధ్యతను విస్మరించి- భాధ్యతారహిత్యంగా ఉంటుంది.   ఈ ఏడాది బాయిల్ రైస్ పంట కేజీ కూడా తీసుకొము అన్నది- రా రైస్ ఎంత తీసుకుంటుందో చెప్పలేదు. నవంబర్ ఒకటి లేదా రెండో వారంలో ఏ పంట వెయ్యలో ప్రభుత్వం చెప్తుంది అని అసెంబ్లీలో చెప్పాను. వరికంటే మంచి లాభాలు వచ్చే పంటలు 10 ఉన్నాయి. 80శాతం బాయిల్ రైస్- 20శాతం నార్మల్ రైస్ తీసుకుంటాం అని కేంద్రం చెప్పింది. 50లక్షల టన్నులు తీసుకుంటాం అని అగ్రిమెంట్ చేసుకోని 24లక్షల టన్నులు- తరువాత 20లక్షల టన్నులు మాత్రమే తీసుకుంది,’’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు. ‘‘సిల్లి-దొంగ బీజేపీ ధాన్యం కొంటా అని ఆర్డర్స్ ఇస్తుందా? వర్షాకాలం ధాన్యం తీసుకునే వరకు కేంద్రంను నిద్ర పోనివ్వము. కొత్త రాష్ట్రం అని మర్యాదగా ఇన్ని రోజులు మెలిగాము. కోటిన్నర ఎకరాల ధాన్యం కొంటామని సిల్లి బీజేపీ ఆదేశాలు ఇస్తుందా? ఇన్ని రోజులు మీ ఆటలు చెల్లినాయి- ఇక నుంచి చూద్దాం,’’ అంటూ హెచ్చరించారు.

బండి సంజయ్ పైన ధ్వజం

‘‘అగమైన తెలంగాణ రైతాంగాన్ని ఒక దారికి తెచ్చాము. బండి సంజయ్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. బండి సంజయ్ ఎవరి మెడలు వంచుతాడు. బండి సంజయ్ భాద్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఢిల్లీ బీజేపీ ఒకటి చెప్తే- రాష్ట్ర అధ్యక్షుడు అబద్ధాలు చెప్తున్నాడు. బండి సంజయ్ భాద్యత లేదు- పూర్తి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. నాపై వ్యక్తిగతంగా మాట్లాడినా క్షమించాను. బండి సంజయ్ కి నెత్తి లేదు- కత్తి లేదు. ప్రజలు సొల్లు కబర్లు నమ్మకండి. కేంద్ర ప్రభుత్వం వడ్లు- బియ్యం తీసుకుంటా అంటే మేము వద్దు అంటున్నామా? అనవసరమైన రాజకీయాల కోసం రైతుల జీవితాలను పణంగా పెట్టము. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలంటారు- ఢిల్లీ ధాన్యం కొనమని చెప్పేది వీళ్ళే, బండి సంజయ్ మనిషి అయితే- నిజాయితీ ఉంటే కేంద్రం ధాన్యం కొంటామని ఢిల్లీ నుంచి ఆదేశాలు తేవాలి. అల్లాటప్పా గాళ్ళు- పనికిమానిల మనిషి బండి సంజయ్. ఎంపీగా బండి సంజయ్ ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చిండా?’’ అంటూ కేసీఆర్ దుయ్యపట్టారు. ‘‘బండి సంజయ్ మా మంత్రి నిరంజన్ తో చర్చకు రావాలంటూ కేసీఆర్ సవాలు చేశారు. బండి సంజయ్ మెడలు నాలుగు ముక్కలు కావాలి,’’ అని అన్నారు.

బండి సంజయ్ సొల్లు కబుర్లు

‘‘బండి సంజయ్ సొల్లు కబుర్లు నమ్మకండి. వరి పంట వేస్తే రైతులు ఆగమైతారు. కేంద్రమంత్రులు కార్లు ఎక్కించి రైతులను చంపుతున్నారు- రాష్ట్ర ముఖ్యమంత్రులు భాద్యత లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపుతా అని బండి సంజయ్ అన్నాడు. బండి సంజయ్ కి అహంకారంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపే దమ్ము ఉందా? కేసీఆర్ ను జైలుకు పంపి బతికి బట్ట కడుతావా. కేసీఆర్ ను టచ్ చేసి చూడు’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన కేసీఆర్ నిప్పులు చెరిగారు.

మతాలను రెచ్చగొడుతోంది బీజేపీ

‘‘నీళ్ల వాటా సెక్షన్-3 కింద తేల్చమంటే ఇప్పటికి పరిష్కరించలేదు. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే ఒక్కటి ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలు ఒక్కటి ఇవ్వలేదు. బీజేపీ నాయకులు ఎక్కడ పడుకున్నారు. ఇక మేము ధర్నాలు చేస్తాం. ఉత్తర భారత రైతులకు మేము అండగా నిలబడుతాం. కేంద్రం దేశానికి చేసిన ఒక్క మంచి పనైనా బీజేపీ చేసిందా ఏడేండ్లల్లో. మతాలను రెచ్చగొట్టి- బార్డర్స్ సాకుగా దేశాన్ని ఆగం చేసింది బీజేపీ.

బీజేపీ- బీ కేర్ పుల్

‘‘కేసీఆర్ బతికి ఉన్నంత కాలం దళితబంధు పథకం అమలు రాష్ట్రం అంతా అమలు చేస్తాం. ఒక్క ఎన్నిక గెలుస్తాం- ఒడుతాం. నాగార్జున సాగర్ లో గెలిచాం- ప్రజలు చూస్తున్నారు అన్ని. దేశం అంతా బీజేపీ ఓడింది- బీజేపీ వ్యతిరేకత వచ్చినట్లా? 2018లో 107 సీట్లలో డిపాజిట్లు పోయిన పార్టీ బీజేపీ. కుక్కలు మొరుగుతాయి పోనీ అని ఉరుకున్నాం. అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుకలు చిరేస్తాం- కేసీఆర్. మీ చరిత్ర అంతా ప్రజలకు తీయజేస్తాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ- కోజ్ ఫ్యాక్టరీ కి కేంద్రం నో అన్నది. రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్రానికి ఒక్క పైసా పనిచేసారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి- పిచ్చి కూతలు కూస్తే ఉరుకోమ్. మేము ప్రజలు నామినేట్ చేస్తే వచ్చాము- ఢిల్లీ నామినేట్ చేస్తే రాలేదు. చిల్లర రాజకీయాల కోసం ప్రజల బతుకులు నాశనం చేస్తానంటే కేసీఆర్ ఉరుకోమ్. దమ్ము ఉంటే అవినీతి నిరూపించాలి- దమ్ముంటే కేసులు పెట్టండి. మేము ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఉరుకోం’’ అంటూ కేసీఆర్ హుంకరించారు.

దిల్లీలో ధర్నా చేస్తాం, కుట్రలన్నీ బయటపెడతాం

‘‘కిషన్ రెడ్డి తప్పులు మాట్లాడుతున్నారు. రైతులను తొక్కండి- సంపండి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నేను వార్నింగ్ ఇస్తున్నా- జాగ్రత్తగా ఉండండి. అన్ని కుట్రలు బయట పెడుతాం. పార్లమెంట్ ను దద్దరిల్లిన చేస్తాం. తెలంగాణ కేబినేట్- ప్రజాప్రతినిధులు అంతా ఢిల్లీలో ధర్నా పెడుతాం. పంజాబ్ లో మొత్తం ధాన్యం కొంటారు- తెలంగాణ లో ఎందుకు కొనరు? కేంద్రం దగ్గర రాష్ట్రానికో నీతి ఉంటదా?’’ అని ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దేశం ఊర్లకు ఊర్లె కడుతుంది. దేశ సరిహద్దు కాపాడటంలో బీజేపీ వైఫల్యం చెందింది. గంగానది లో బీజేపీ వల్ల శవాలు తెలినాయి. రేపటి నుంచి దేశంలో అగ్గి పెడుతాం- ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు

‘‘కేఆరేంబి- జిఅరేంబి డ్రామానా? శకావత్ నాకు ఇచ్చిన మాట ప్రకారం ట్రిబ్యునల్ కు రిఫర్ ఎందుకు చేయరు. తెలంగాణకు నీళ్లు వద్దా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని రకాల పోరాటాలు చేస్తాం. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ ఉన్నాం. బీజేపీ ఎమ్మెల్యేలే వాళ్ళ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. నేను కష్టపడి తెలంగాణ తెచ్చాను. తెలంగాణను ఆగం చేస్తావుంటే నేను ఉరుకోను,’’ అని చెప్పారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles