Sunday, December 22, 2024

రైతు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలి: కేసీఆర్ ధ్వజం

 ‘‘దేశానికి ఆహారం భద్రత కల్పించడం కేంద్రం భాద్యత. కేంద్రం తన సామాజిక భాధ్యతను విస్మరించి ధాన్యం కొనము అని మాట్లాడుతోంది. కేంద్రం రాద్దాంతం పుట్టించి దేశ రైతాంగాన్ని గందరగోళల పరిస్థితి సృష్టిస్తోంది. కేంద్రం చిల్లరకొట్టు వ్యాపారి లాగా ప్రవర్తించవద్దు.  దేశంలో నిల్వలు పెరిగితే ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సిన భాద్యత కేంద్రంపై ఉంటది. ఇంత నిశమైన- దిగజారుడు రాజకీయం ఇప్పటి వరకు చూడలేదు,’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విమర్శించారు.

బీజేపీ బుల్ బుల్ ప్రభుత్వం, కిషన్ రెడ్డికి బుద్ధి లేదు

‘‘మెడమీద కత్తిపెట్టి పారాబాయిల్డ్ రైస్ భవిష్యత్ లో ఇవ్వము అంటే గత పంటను కేంద్రం కొన్నది. రా రైస్ ఎంత తీసుకుంటారో చెప్పమంటే కేంద్రం చెప్పడం లేదు.  కేంద్రం ఆడుతున్న లంగనాటకం ఇవ్వాళ బయటపడాలి- ప్రజలకు తెలియాలి.  సడెన్ గా బాయిల్డ్ రైస్ గింజ కూడా తీసుకొము అని స్పష్టం చేసింది. తెలంగాణ కు ముందు పదేళ్లు ఏడాదికి 10.09 మెట్రిక్ టన్నుల లక్షల ధాన్యం సేకరిస్తే- ఈ ఏడేళ్లలో ఏడాదికి 69.38 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 2020- 21లో అత్యధికంగా 141.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. పార్లమెంట్ లో టీఆరెస్ అడుగుతే కేంద్రం సప్పుడు లేదు. తెలంగాణ లో పండేదే బాయిల్డ్ రైస్ కదా. కిషన్ రెడ్డి రండా మంత్రిలాగా మాట్లాడుతున్నారు. 750మంది రైతులను పొట్టన పెట్టుకున్న అంతకుల పార్టీ. రాబంధుల పార్టీ. కిషన్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మాట్లాడుతాం. పెట్రోల్- డీజిల్ ధరలు కేంద్రం పెంచితే రాష్ట్రాలు తగ్గించాలా? సిగ్గు ఉందా ధర్నా చేయడానికి. రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ. కిషన్ రెడ్డి కి దమ్ము ఉంటే బాయిల్డ్ రైస్ కొనమను. కిషన్ రెడ్డి కి అగ్రికల్చర్ పాలసీ తోక తెలుసా? ఇవ్వాళ్టికి 22లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం బుల్ బుల్ ప్రభుత్వం,’’ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

పియూష్ గోయల్ కి సిగ్గూఎగ్గూ లేదు

‘‘రైతుల కోసం ఎంపీలు కేంద్ర మంత్రి దగ్గరకు పోతే మీకు పనేం లేదా? అంటుండు. బీజేపీ చీప్ గా మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతులను కేంద్రం ముంచుతుంది.  మత రాజకీయాలతో దేశాన్ని పిచ్చి పట్టిస్తారు. మత విభజన రాజకీయం దేశానికి అవసరం లేదు. బుట్టచోర్ గాళ్ళు తెలంగాణ భూముల ధరలు పడిపోతాయి అన్నారు. 5 ఎకరాలు ఉన్న రైతు ఇవ్వాళ కోటీశ్వరుడు. తెలంగాణ లో ఎక్కడైనా 25లక్షలు కనీస ధర ఎకరానికి ఉంది. తెలంగాణ రైతులు- ఏపీ, కర్ణాటక లో భూములు కొంటున్నారు. గ్రామాల్లో కోట్ల రూపాయలు తిరుగుతున్నాయి. రాబందులు లాగా రైతులపై కేంద్రం పడ్డది

కిషన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడిండు అని పీయూష్ గోయల్ చెప్పారుపీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.సిగ్గు- లజ్జ ఏమైనా ఉంటే పీయూష్ గోయల్- కిషన్ రెడ్డి కళ్ళు తెరువాలి. ఆకలి స్థానాల్లో ఇండియా 101, మనకంటే బంగ్లాదేశ్- పాకిస్తాన్ తక్కువ స్థానాల్లో ఉన్నాయి. గతంలో 96 ఉంటే- బీజేపీ పాలనలో 101కి చేరింది. బీజేపీ పాలనలో దేశంలో ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. రైతు చట్టాలు గొప్పవి అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నారు ఇవ్వాళ ఉత్తర భారత దేశ రైతులకు- భవిష్యత్ లో తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్తారు. కరెంట్ పై పెత్తనం కేంద్రం తీసుకుంటదని చెప్తోంది. పవర్ రిఫామ్స్ పేరుతో మా మెడపై కత్తి పెట్టుడు ఎందుకు? దేశంలో రైతులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలి!. బీజేపీ ప్రభుత్వం దిగ్గుమాలిన పాలన చేస్తోంది. మరణించిన రైతులకు రూపాయి నష్టపరిహారం ఇవ్వమంటే ఎందుకు ఇవ్వదు,’’ అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు.

వర్షాకాలం పంటను పూర్తిగా కొంటాం

ఈ వర్షాకాలం పంటను పూర్తిగా మేము కొంటాము. కేంద్రం మా దగ్గర కొనకపోతే కిషన్ రెడ్డి, ప్రధాని ఇంటి ముందు పోస్తాం. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కిషన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి- ఎక్కడికైనా? ఇదేనా కిషన్ రెడ్డి మొగతనం అంటే. ఒక్క హుజురాబాద్ గెలువగానే ఇంత అహంకారమా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్ని మేము ఏకగ్రీవం అయ్యాయి- మీ పార్టీ ఎక్కడా? యాసంగి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం చేతులు ఎత్తివేసింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంది. మా పేగులు తెగే వరకు కొట్లాడినం. రైతుల బతుకులతో కేంద్రం చెలగాటం ఆడుతోంది. ధాన్యం కొనమంటే హుజురాబాద్ అని మాట్లాడుతోంది. ఇప్పటికి 10వేల కోట్లు నష్టపోయింది పంట కొనుగోళ్ల వల్ల రైస్ మిల్లర్లను ప్రోత్సహించి బాయిల్డ్ రైస్ పెట్టిందే కేంద్రం.చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ‘టీఆర్ఎస్ రైతు బంధువుల ప్రభుత్వం. బీజేపీ రైతు రాబందుల పార్ట, ’’ అంటూ బిజెపి ప్రభుత్వం పై కేసీఆర్  నిప్పులు చెరిగారు.

బీజేపీ మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం

తెలంగాణ రైతు ప్రయోజనాలను, వ్యవసాయాన్ని కేంద్రం ఆగం చేస్తున్నదని మండిపాడు, బిజెపి ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం కాదు. ముంచే ప్రభుత్వం, తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనబోమని చెప్పడం దుర్మార్గం. యాసంగి వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యాసంగి వరి పంట కొనుగోలు కేంద్రాలను పెట్టవద్దని కేబినేట్ నిర్ణయించింది. కేంద్రం చేతులెత్తేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలసాగుపై నిర్ణయం తీసుకోవాలి. స్వంత వినియోగం, విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం, వ్యాపార అవకాశమున్న వారు వరి సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్బంధం విధించదు. కేంద్రం చేతులెత్తేసినందున రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి కొనుగోలు చేయలేదు. రైతు నష్టపోవద్దనే వరి పంట వేయవద్దని కోరుతున్నా.కేంద్రం తన విధానాలతో రైతాంగాన్ని గందరగోళపరుస్తున్నది. బిజెపి వందశాతం రైతు వ్యతిరేక పార్టీ. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశాం. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో బిజెపి కన్నా తెలంగాణ ప్రభుత్వం కోటి రెట్లు మెరుగ్గా ఉంది. కెసిఆర్ చేతిలో ఎన్ని ఉన్నాయో అన్ని రైతులకు అందజేస్తం,’’ అని ముఖ్యమంత్రి అన్నారు.  

మన రైతు బీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు

‘‘తెలంగాణ రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రం అత్యధిక పంట పండిస్తున్నందున కేంద్రం ఓర్వడం లేదు. 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ, చేతగాని దద్దమ్మ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం హంతక ప్రభుత్వం. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ. సాక్షాత్తూ ప్రధానమంత్రే క్షమాపణలు చెప్పిండు. కేంద్రంలో బీజేపీది.. బుల్ బుల్ ప్రభుత్వం. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నది బీజేపీ. ధాన్యం కొంటరా.. కొనరా.. అంటే సప్పుడు చేయరు. అది చెప్పకుంట బీజేపీ వాళ్లు ఏమేమో చెప్తరు. ఆహార భద్రత కేంద్ర ప్రభుత్వ సామాజిక బాధ్యత. కేంద్రం లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్నది. తన సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ సూడలే. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కోరుతది. తెలంగాణలో రైతు సంక్షేమ విధానాలు అమలు.  అందుకే ధాన్యం పంట బాగా పెరిగింది. తెలంగాణలో దొడ్డు వడ్లే పండుతయి. బాయిల్డ్ రైసే వస్తది.. కేంద్రం కొనాలె మరి. కేంద్రమంత్రి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలె.  తెలంగాణలో 35 డిగ్రీల టెంపరేచర్లో పండుతయి. కేంద్రంతోని దొడ్డు వడ్లు కొనిపించాలె. కేంద్రమంత్రి సిఫాయి అయితే.. బాయిల్డ్ రైస్ కొనిపించాలెకేంద్రం కొనదు అని చెప్తే.. రండ కేంద్రమంత్రి అయితడు. తెలంగాణలో ధాన్యం కొనమంటే కొనరు. యాసంగిలో నూక ఎక్కువ వస్తది.. కొనాల్సిందే. ఎంత ధాన్యం తీసుకుంటదో కేంద్రం చెప్పదు. బీజేపీ నాయకులు కల్లాల కాడ డ్రామాలు పెడ్తరు. టీఆర్ఎస్ వాళ్లు కేంద్రమంత్రులను కలిసేందుకు వెళ్లారు. మీకేం పనిలేదా ? అని అడిగాడు కేంద్రమంత్రి, ఇది సరికాదు. కేంద్రం చేతగాని తనాన్ని రాష్ట్రంపై రుద్దుతరా? వందశాతం రైతు వ్యతిరేక పార్టీ. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతడు,’’ అంటూ తిట్టిపోశారు.

ఆకలి సూచికల మొత్తం 116 దేశాలలో మనది 101 దేశం

‘‘ప్రపంచ ఆకలి సూచికలో 116 దేశాల్లో ఇండియా 101వ స్థానంలో ఉంది. 2016లో ఇండియా స్థానం 96 ఉండేది.కేంద్ర విధానాలతో.. దేశంలో ఆకలి కేకలు బాగా పెరిగాయి. పాకిస్తాన్ ర్యాంకు 97, బంగ్లాదేశ్ ర్యాంకు 79 నేపాల్ కూడా బాగుంది. అన్నపురాసులు ఒకవైపు.. ఆకలి కేకలు ఒకవైపు. ఘనత వహించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఉత్తర భారత రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పింది. రేపు తెలంగాణ రైతులకు కూడా చెప్పాల్సి వస్తది. రైతుల ఉసురు పోసుకోవడానికి బీజేపీ కరంటు చట్టం తెచ్చింది. ప్రతి బోరు కాడ మీటరు పెట్టాలంటున్నది కేంద్రం. ఇదేందంటే.. రైతు మెడపై కత్తి పెడతానంటది. లేకుంటే రాష్ట్రానికి వచ్చే హక్కులు, అధికారాలు కట్ చేస్తదట. కేంద్రమే విద్యుత్ మీద పెత్తనం తెస్తదట. కేంద్రం పెత్తనం ఉంటే కరంటు 24 గంటలు వద్దంటరు. అందరిలాగానే 16 గంటలే ఇస్తమంటరు.. ఇది మనకు కుదురుతదా? రైతులు, సామాన్యులకు రక్షణ ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలె. మేం వడ్లు కొనం.. అయినా కళ్లాల కాడ కొట్లాడుతం అంటరు. పనికిమాలిన చట్టాలు చేసేది బీజేపీ.. వాపసు తీసుకునేది బీజేపీయే. 750 మంది రైతులకు క్షమాపణలు చెప్పేదీ కేంద్ర ప్రభుత్వమే. ఏడేండ్లలో మోడీ ప్రభుత్వం సాధించేమిటి? పేదలకు, దళితులు, గిరిజనులు, బీసీలు, యువతకు, మహిళలకు చేసిందేమిటి?’’ అంటూ నిలదీశారు.

ఎడాపెడా అప్పులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

‘‘దేశంలో అప్పులు పెంచింది బీజేపీ. 80 లక్షల కోట్ల అప్పులు చేసింది. పాత అప్పులు 50 లక్షల కోట్లు ఉన్నయి.దేశాన్ని రావణకాష్టం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నది కేంద్రం. తెలంగాణ అన్నింట్లో నంబర్ వన్ ఉన్నది. రాష్ట్రంలో మత్స్య సంపద, గొర్ల సంపద, పశు సంపద పెరుగుతున్నది. ఇదంతా ప్రగతి కాదా.. కేంద్రానికి కనిపిస్తలేదా? బీజేపీ ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తున్నది  పనికిమాలిన, అవగాహనలేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడున్నడు. వరి మాత్రమే వేయండి అని రైతులకు చెప్తడుకేంద్రమంత్రిని అడిగితే, అవగాహన లేక మాట్లాడిండు అన్నడు. బీజేపీ రైతులను మోసం చేస్తది.. మళ్లీ ఉల్టా మాట్లాడుతది. ఉప్పుడు బియ్యం కొనం.. అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డే చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనం అని, పాలసీ మార్చుకున్నం అన్నది. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి.. రాష్ట్రం ఏం చేస్తది? అందుకే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదు. కేంద్రానివి అసమర్ధ విధానాలు. వాళ్లకు పాలించడం చేతకాదు. బహిరంగ చర్చకు వస్తారా? సిద్దంతెలంగాణలో ఎంత కొంటరో చెప్పండి. రైతులు తిండికి పండించుకోవచ్చు. విత్తన కంపెనీలు కొంటే సరే. మిల్లర్లు ఓకే అంటే కొనుక్కోవచ్చు. అంతేగానీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుండవు. మేం బీజేపీలాగా చిల్లర రాజకీయాలు చేస్తలేం. కేంద్రం నిరాకరించింది కాబట్టి.. రాష్ట్రం ధాన్యం కొనుగోలు చెయ్యదు. కేంద్రం కనీస మద్దతు ధర చట్టం కూడా ఈ సెషన్ లోనే తేవాలె,’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles