Sunday, December 22, 2024

స్త్రీలు సృష్టికర్తలు, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది : హిజాబ్ వివాదంపై కవిత

మహిళల వస్త్రధారణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంఎల్ సి కవిత. ఈ సందర్బంగా తాను చేతితో రాసిన కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు..నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు …హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలన్నారు. స్త్రీలు సృష్టికర్తలు అన్న కవిత…వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బంగా తాను రాసిన కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు..

హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్..

మతమేదైనా సరే…

మనమంతా భారతీయులమే..

సిందూర్-టర్బన్-హిజాబ్-క్రాస్ 

ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే…

త్రివర్ణ పతాకాన్ని” రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..

జై హింద్” అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..

సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్” అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..

జన గణ మన” తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..

మనకు చెప్పింది ఒక్కటే..

మనం ఎవరైనా…  మనమంతా భారతీయులమనే.. !!

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles