సుందర కశ్మీరం
బారత మాత కిరీటం
భూతల స్వర్గం
అనేక చిత్రాల్లో ఊరించిన
అందమైన కలల సాకారం.
దల్ కాసారంలో పడవలు
మంచుకొండల్లో హిమ రాశులు
అడవులు పర్వతాలపై సరాగాలు
అంతా గతమై పోయింది.
రెండు తరాల నిర్లక్ష్యంతో
కాపురుషుల సాంగత్యంతో
భూతాల స్వర్గంగా మారి పోయింది.
పిల్లను బడికి వెళ్ళనివ్వని జడత్వం
పుస్తకాలు పట్టాల్సిన చేతులకు
రాళ్ళు పట్టించిన రాజకీయం
మన ప్రాణాలను రక్షించే సిపాయిల
ప్రాణాలుతోడే పాకివాడికి ఆదరణ
అతిధులమీద ఆధార పడ్డ జనం
వారిమీదేదాడులుచేస్తూ
కడుపు కాల్చుకునే మూర్ఖత్వం
పట్టిన జాడ్యం వదలి
నలుగురిబాట నడిచే
శుభదినం సాకారమవుతుంది
కుంకుమ పువ్వుల ఆపిల్ పళ్ళ రంగులతో
అదిగో వెచ్చని సూర్యోదయ మవుతూంది
కశ్మీరం నిద్ర లేస్తూంది.
Also read: గుడిపాటి వెంకట చలం
Also read: బాల్యం
Also read: న స్వాతంత్ర్య మర్హతి
Also read: పండగచేస్కో
Also read: ఓట్ల పండగ