జీడిమెట్ల సురారం లోని ఉమా మహేశ్వర స్వామి దేవాలయం లో తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం (టీకేఎస్ బీఎస్) ఆధ్వర్యంలో ఆదివారంనాడు కార్తీక సమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఏమ్మెల్సీలు వాణిదేవి, వంటేరు యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ డేవలప్ మెంట్ చైర్మెన్ శ్రీ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి, పీవీ నరసింహారావు తనయులు శ్రీ పీవీ ప్రభాకర రావు, దేవాలయ కమిటీ చైర్మెన్ శ్రీ మదన్ గౌడ్ , హాస్య బ్రహ్మ శ్రీ శంకర నారాయణ గారు పాల్గొన్నారు…అంతకు ముందు గొపూజ, కార్తీక దీపాలంకరణ, దీర్ఘసుమంగళీభవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి…ముఖ్య అతిథి శ్రీ వివేకా నంద మాట్లాడుతూ బ్రాహ్మణ అభ్యున్నతికి టిఆర్ ఎస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని నా ప్రాంతంలోని బ్రాహ్మణ సోదరులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు…ఇలాంటి కార్యక్రమాల వల్ల మానసిక ఉల్లాసం, ఆద్యాత్మిక ప్రశాంతత వుంటాయని ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి అన్నారు..ఇక ఇటీవల కాలంలో బ్రాహ్మణ చైతన్యం వెల్లి విరుస్తుందని, ఏ సమావేశంలో చూసినా బ్రాహ్మణ సోదరులు ఒక తాటి మీదకు వస్తున్నారని ఎమ్మెల్సీ వాణి దేవి అన్నారు…ఆమె చేతుల మీదుగా 108 మంది సుహసినులకు సన్మానం చేశారు .సభాధ్యక్షత వహించిన శ్రీ బండారు రాం ప్రసాద్ రావు తోపాటు, నిర్వాహకులు జెవిఎల్, కులకర్ని వెంకట రావు శర్మ, వెల్డండ నరసింహారావు, రామాయణ శర్మ, తదితరులు మాట్లాడారు.