- జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాల పిలుపు
కొత్త వ్యవసాయ చట్టాలనూ, కార్మిక కోడ్ లనూ, విద్యుత్ సవరణ చట్టాలనూ రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సమరశీలంగా రైతులు చేస్తున్న పోరాటం కొనసాగుతున్నది. వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులలో పోరాడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో పట్టుదలతో పోరాడుతున్న రైతులు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 50 మందికి పైగా చనిపోయారు. రైతు సంఘాలు.. ప్రతిపక్షాలు. మేధావులు ప్రజాస్వామిక శక్తులు, అందరూ ఆందోళనలు చేస్తూ ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. అయినా మోడీ ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయడం లేదు.
కార్మిక చట్టాల స్థానంలో కోడ్ లు
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకు వచ్చింది. విద్యుత్ రెగ్యులరేషన్ సవరణ చట్టం 2020 తో విద్యుత్ భారాలు వెయ్యబోతున్నారు.కార్మిక. ప్రజల హక్కులను హరించి యజమానులకు యధేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ చట్టాల అన్నింటిని బేషరతుగా రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తూ జరుగుతున్న కార్మిక కర్షక పోరుయాత్ర జనవరి 27 న మద్యాహ్నం 12 గం.లకు మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది.
కార్మికులు, కర్షకులు,ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. పాల్గొన్నవారు ఉద్యోగుల సంఘాల నాయకులు ఎం. రాందాసు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణు, నాయకులు దిలిప్, తిరుపతి, కార్మిక బిడ్డల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి గుళ్ల బాలాజీ, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి భాస్కర్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి బి.గోవర్దన్ పాల్గొన్నారు.