భగవద్గీత – 13
అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ పావెల్ హబుల్ అనే ఆయన 1925 లో ఒక విషయం చెప్పారు. అదేమిటంటే ఈ విశ్వము విస్తరిల్లుతున్నదని. విశ్వము అన్నా, బ్రహ్మము అన్నా ఒకటే. విస్తరిల్లడము అంటే పని జరుగుతున్నది అనే కదా! అంటే కర్మ!, బ్రహ్మంనుండి పుట్టినది అనే కదా అర్ధం. మరి ఈ విశ్వం, లేదా బ్రహ్మం ఎప్పుడు పుట్టింది?
Also read: స్వధర్మ ఆచరణే శరణ్యం
దేనినుండి పుట్టినది?
నాశనముకాని దాని నుండి అనే సమాధానం వస్తుంది. మనకు ఒక సూత్రం తెలుసు శక్తిని పుట్టింప చేయలేము. మరియు నశింపచేయలేము. కాని శక్తి పదార్ధంగా, పదార్ధం శక్తిగా రూపాంతరం చెందుతుంది.
(Law of conservation of energy) అంటే శక్తి నాశనము లేనిది. అంటే ‘‘క్షరము’’ కానిది అక్షరము అన్నమాట! మరి బ్రహ్మ అంటే బృహ్మణ శక్తి గల లేదా చక్కగా విచ్చుకొని విస్తరిల్లగల అని అర్ధం.
తైత్తిరీయ ఉపనిషత్తులో. సో కామాయత, బహుస్యాం ప్రజాయేయేతి.. అంటూ వస్తుంది అంటే. భగవంతుడు కూడా పెక్కుమందిగా అవ్వాలనే కోరిక కలుగగా ఒక్కడయిన తాను వివిధ జీవరాసులగా మారాడట. అంటే విస్తరిల్లాడు అన్నమాట.
వివేకానంద స్వామి ఒక చోట చెపుతారు Expansion is sign of life అని.
భగవద్గీత లోని ఈ శ్లోకం చూడండి !
‘‘కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్’’
కర్మ బ్రహ్మము నుండి పుట్టినది. బ్రహ్మము నాశనము కాని దానినుండి పుట్టినది. అందువలన సర్వము వ్యాపించి ఉన్న బ్రహ్మము ఎల్లప్పడు యజ్ఞము నందే ప్రతిష్ఠితమయి ఉన్నది.
ఎంత గొప్ప Science చూడండి!
ఇదీ భగవద్గీత.
Also read: అనుకరణ మానవ నైజం