న్యాయ వాద దంపతులు వామనరావ్.. నాగమణి ల హత్య కేసులో కాపు అనిల్ ను మంగళవారంనాడు అరెస్ట్ చేశారు. కాపు అనిల్ s/o లేట్ రమేష్,33yrs, మున్నూరు కాపు, కూలీ, ఎరుకల గూడెం, మంథని అనే వ్యక్తి బిట్టు శ్రీనుకి వరుసకు తమ్ముడు అవుతాడు. అనిల్ ఆర్థిక అవసరాలకు బిట్టు శ్రీను డబ్బులు ఇస్తూ ఉంటాడు. అనిల్ బిట్టు శ్రీను కట్టుకొనే కొత్త ఇంటి పనులు, ఏ ఇతర పని చెప్పిన కాపు అనిల్ చేస్తుంటాడు.
తేదీ 17.02.2021 న తులసిగరి శ్రీను అలియాస్ బిట్టు శ్రీను కాపు అనిల్ కి ఫోన్ చేసి ocp -2 కి వెళ్ళాలి ఇంటికి రా అని చెప్పగా అనిల్ బిట్టు శ్రీను ఇంటి దగ్గరకు వెళ్లి బిట్టు శ్రీను తో కలిసి శ్రీను కారులో మంథని నుండి OCP -2 కి వెళ్లడం జరిగింది. అక్కడ బిట్టు శ్రీను కి సంబందించిన కొత్త డ్రిల్లింగ్ మిషిన్ కి పూజ చేయడం జరిగింది.
Also Read : లాయర్ దంపతుల హత్యను సీరియస్ గా తీసుకొన్న పోలీసులు
ఆ పూజ సమయంలో బిట్టు శ్రీను కి కుంట శ్రీను ఫోన్ చేసి ఈరోజు రోజు గట్టు వామన రావు మంథని కి వచ్చాడు అని చెప్పాడు. బిట్టు శ్రీను వామన్ రావు ఎప్పుడు దొరికినా చంపాలనే కుట్ర, ప్రణాళిక లో భాగంగా బిట్టు శ్రీను అనిల్ సెల్ ఫోన్ నుండి చిరంజీవి కి ఫోన్ చేసి ఇవ్వమనగా అనిల్ చిరంజీవికి ఫోన్ చేసి బిట్టు శ్రీనుకు ఇవ్వడం జరిగింది.
బిట్టు శ్రీను ఫోనులో చిరంజీవి తో అర్జెంట్ గా మంథని బస్ డిపో దగ్గరకు రా వచ్చేటప్పుడు అంతకుముందు తయారు చేపించిన రెండు కత్తులను తీసుకునిరా వామన్ రావు మంథని కి వచ్చాడు అని తెలిసింది. ఈ రోజు వామన్ రావు ని ఏలాగైనా చంపాలి అని చెప్పి తొందరగా రమ్మని చెప్పాడు.
Also Read : లాయర్ దంపతుల హత్యలో బిట్టుశ్రీను పాత్ర కీలకం: డీఐజీ నాగిరెడ్డి
బిట్టు శ్రీను, కాపు అనిల్ ఇద్దరూ బిట్టు శ్రీను కారులో OCP -2 నుండి మంథని కి వచ్చే మార్గం మధ్యలో అనిల్ ని తన సెల్ ఫోన్ నుండి చిరంజీవికి ఫోన్ చేసి ఇవ్వమని చిరంజీవి తో పలుమార్లు బిట్టు శ్రీను ఫోన్ మాట్లాడాడు
వీరు ఇద్దరూ మంథని బస్ డిపో దగ్గరికి చేరుకున్న కొంచెంసేపటికి చిరంజీవి తన మోటార్ సైకిల్ పై అక్కడికి రావడం జరిగింది. తనతో రెండు కొబ్బరి బొండం నరికే కత్తులను చిరంజీవి తీసుకొని వచ్చాడు. వాటిని బిట్టు శ్రీను కారు ముందు డ్రైవర్ ప్రక్క సీట్ క్రింద పెట్టాడు. వాటిని కనపడకుండా కాపు అనిల్ లోపలికి పెట్టడం జరిగింది.
Also Read : న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్
చిరంజీవి బిట్టు శ్రీను కారు తీసుకోని MRO ఆఫీస్ దగ్గర ఉన్న కుంట శ్రీను దగ్గరకు వెళ్లడం జరిగింది.
తరువాత బిట్టు శ్రీను, కాపు అనిల్ లు ఇద్దరూ కలిసి చిరంజీవి మోటార్ సైకిల్ పై బిట్టు శ్రీను కొత్తగా కడుతున్న ఇంటి వద్దకు వెళ్లడం జరిగింది.
కొంత సమయం తరువాత బిట్టు శ్రీను కి కుంట శ్రీను ఫోన్ చేసి వామన్ రావు తో పాటు అతని భార్య పివి నాగమణి ని కూడా ఉందని చెప్పడం జరిగింది. అప్పుడు బిట్టు శ్రీను కుంట శ్రీను తో ఇద్దరిని చంపండి అని చెప్పడం జరిగింది.
అందజా 2:30 గంటల తరువాత కుంట శ్రీను, చిరంజీవి లు బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి గట్టు వామన్ రావు మరియు అతని భార్య పివి నాగమణి లను చంపాము అని చెప్పడం జరిగింది. తరువాత వాళ్ళు బిట్టు శ్రీను కి చాలా సార్లు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. బిట్టు శ్రీను అనిల్ ఫోన్ తీసుకోని చాలా ఫోన్ లు మాట్లాడడం జరిగింది.
Also Read : లాయర్ దంపతుల హత్యలో పుట్టమధు మేనల్లుడి ప్రమేయం
తరువాత బిట్టు శ్రీను అనిల్ తో గట్టు వామన్ రావు, అతని భార్య హత్య గురించి నీకు నాకు తెలుసు కాబట్టి నీ ఫోన్ లో నుండి నీ సిమ్ కార్డు తీసుకొని పోలీసులకు సాక్ష్యం దొరకకుండా ఉండేందుకు నీ ఫోన్ ని ఎక్కడైనా పడేయమని చెప్పి అనిల్ ని ఇంటికి వెళ్ళమని బిట్టు శ్రీను చెప్పాడు. బిట్టు శ్రీను కొత్త ఇంటి వద్ద నుండి కాపు అనిల్ ఇంటికి వెళ్లిపోయాడు
సంఘటన జరిగిన రెండు మూడు రోజుల వరకు కాపు అనిల్ సెల్ ఫోన్ వాడడం జరిగింది. అనిల్ కి బిట్టు శ్రీను ని పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తెలియడం తో తనను కూడా పోలీసులు పట్టుకుంటారని బిట్టు శ్రీను చెప్పిన విధంగా ఫోన్ నుండి సిమ్ తీసుకోని ఆఫొన్ పోలీసులకు సాక్ష్యంగా దొరకకుండా ఉండేందుకు మంథని లోని గోదావరి నది దగ్గరికి వెళ్లి అక్కడ నీళ్లలో పడవేయడం జరిగింది. ఆ రోజు నుండి తన సిమ్ ని వేరే ఫోన్లో వేసుకుని వాడాతున్నాను అని పోలీసుల విచారణ లో కాపు అనిల్ కుమార్ ఒప్పుకోవడం జరిగింది.
Also Read : వామనరావు దంపతుల హత్య కేసులో 5వ నిందితుడు లచ్చయ్య అరెస్ట్
మంగళవారం గట్టు వామనరావు, పివి నాగమణి దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీనుకు సహకరించిన కాపు అనిల్ ని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు.