- 244 పరుగులకే కుప్పకూలిన భారత్
సిడ్నీటెస్ట్ మూడోరోజు ఆట ముగిసే సమయానికే ఆతిథ్య ఆస్ట్ర్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిఇన్నింగ్స్ లో భారత్ ను 244 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా 94 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యత సాధించింది.
ఇదీ చదవండి: సిడ్నీ టెస్టులో శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు
అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన భారత్ ను కంగారూ జట్టు పదునైన బౌలింగ్, పాదరసం లాంటి ఫీల్డింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. కెప్టెన్ రహానే 22 పరుగుల స్కోరుకు పేసర్ కమ్మిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వన్ డౌన్ పూజారా కట్టుదిట్టమైన డిఫెన్స్ తో కంగారూ బౌలర్లను నిలువరించి మొత్తం 176 బంతులు ఎదుర్కొని 5 బౌండ్రీలతో అర్థశతకం పూర్తి చేసి అవుటయ్యాడు. తన కెరియర్ లో 80వ టెస్టు ఆడుతున్న పూజారాకు ఇది 27వ హాఫ్ సెంచరీ.
ఇదీ చదవండి: సిడ్నీ టెస్టులో సిరాజ్ కంటతడి
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ 67 బాల్స్ లో 4 బౌండ్రీలతో 36 పరుగులు సాధించగా అశ్విన్ , హనుమ విహారి రనౌట్లుగా వెనుదిరిగారు. రవీంద్ర జడేజా తుదివరకూ పోరాడి 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ ఆఖరి 8 వికెట్లను కేవలం 148 పరుగులకే నష్టపోయి 244 పరుగుల స్కోరుకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 4 వికెట్లు,హేజిల్ వుడ్ 2 వికెట్లు, స్టార్క్ 1 వికెట్ పడగొట్టారు. కంగారూ సూపర్ ఫీల్డింగ్ తో ముగ్గురు భారత ఆటగాళ్లు రనౌట్లుగా దొరికిపోయారు.
దీంతో 94 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంబించిన కంగారూటీమ్ ఓపెనర్లు పుకోవిస్కీ, వార్నర్ వికెట్ల నష్టానికి ఓవరాల్ ఆధిక్యాన్ని200కు పెంచుకోగలిగింది. ఆస్ట్రేలియా రెండోఇన్నింగ్స్ లో 300కు పైగా స్కోరు సాధించ గలిగితే భారత్ కు కష్టాలు తప్పపు.
ఇదీ చదవండి: సిడ్నీటెస్టులో భారత్ కు దెబ్బ మీద దెబ్బ