నటి విజయశాంతి తిరిగి సొంతింకి చేరుకున్నారు. బీజేపీతో రాజకీయ జీవితం మొదలుపెట్టి, సొంత పార్టీ (తల్లి తెలంగాణ) పెట్టి,రెండు పార్టీలకు మారి కమలం
ధరించారు. కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పారు. ఆమెను బుజ్జగించి కాంగ్రెస్ లోనే కొనసాగించేలా పార్టీ గట్టిగా ప్రయత్నించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ కూడా ఇంటికి వెళ్లి మరీ నచ్చచెప్స ప్రయత్నించారు.
బీజేపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి తర్వాత బయటికి వెళ్లి తెలంగాణ ఉద్యమం సమయంలో ’తల్లి తెలంగాణ పార్టీ‘ పెట్టి కొంతకాలానికి భేషరతుగా దానిని టీఆర్ఎస్ లో విలీనం చేసి, ఆ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన ముందు కాలానికి కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ ఇప్పుడు పాత గూటికి చేరారు.
కమలశ్రేణుల అసంతృప్తి
కమలశ్రేణుల అసంతృప్తి
విజయశాంతి పునరాగమనం పట్ల బీజేపీలోని కొందరు ఆమోదించలేక పోతున్నారని సమాచారం. పార్టీ కష్టసమయంలో ఉన్నప్పుడు వెళ్లిపోయి, పుంజుకుంటున్న సమయంలో తిరిగి రావడం అవకాశవాదంగా వ్యాఖ్యానిస్తురు .క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీగా పేరున్నందున ఆ విషయాన్ని ఎవరు బయటకి చెప్పలేకపోతున్నారు. ఆమె రాకతో పెరిగే ఓట్ బ్యాంకు ఏమిటో అర్థం కాని అంశమని అంటున్నారు.