`మీరు సొంతగా రాజకీయ పార్టీ పెట్టండి.అప్పడే ఓట్లేస్తాం.అందుకు భిన్నంగా ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తామంటే ఒప్పకునేది లేదు` అని సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ముక్తకంఠంతో చెప్పి రెండు రోజులైనా కాలేదు. `తమిళనాట వచ్చే శాసనసభ ఎన్నికల్లో రజనీకాంత్ సహాయం తీసుకుంటాం’ అని ఆయన సహానటుడు కమల్ హాసన్ ప్రకటించడం రజనీ అభిమానులకు మింగుడు పడడం లేదట. అంటే తమ అభిమాన నటుడు పార్టీ ప్రకటించి సహ నటుడికి మద్దతు ప్రకటిస్తారా? లేక మద్దతు ఇమ్మంటూ గంపగుత్తగా అటు వైపు తోలేస్తారా? అనే చర్చ మొదలైంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సంతోష్ బాబును మంగళవారం తమ పార్టీ `మక్కళ్ నిది మయ్యం` లో చేర్చుకున్న కమల్ ఈ ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో అందరి ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నానని, అలాంటప్పుడు స్నేహితుడైన రజనీ ఇంటిని వదిలేస్తానా? అని కూడా కమల్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
రాజకీయ నేతలు పరస్పర రాకపోకలు, పరామర్శలు తప్పు కాదు. కొత్త కూడా కాదు. కానీ ఇప్పటికే పార్టీ ప్రకటించిన కమల్ హాసన్ ఎన్నికల ప్రణాళికల్లో నిమగ్నమవుతుంటే `త్వరలో, సరైన సమయంలో` రాజకీయ ప్రవేశం ప్రకటిస్తా`అంటూ రజనీ చేస్తున్న ప్రకటనలు అభిమానులకు అర్థం కాకుండా ఉన్నాయట. .మరోవంక `పార్ట పెట్టేందుకు ఇప్పడే ఏం తొందర`అని రెండు రోజుల ఇటీవల `రజనీ మక్కల్ మండ్రం` (ఆర్ఎంఎం) కీలక ప్రతినిధులతో జరిగిన సమావేశంలో రజనీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అవి కమల్ ఆకాంక్షకు తోడైతే….