నాకు 25 ఏళ్ళ పై నుంచీ స్నేహితుడు. మా ఇద్దరినీ కలిపింది పాటలు. ఇద్దరం కలిస్తే పాటలే పాటలు. శ్రీ కొప్పరపు కవుల కళా పీఠము సభలకు ఎప్పుడూ నాకు చేదోడుగా ఉండేవాడు. మొన్న 9 వ తేదీ విశాఖపట్నం సభకు కూడా వేదిక ఏర్పాట్లన్నీ అతనే చేశాడు. కొప్పరపు పీఠం ప్రతి సభకు ఆ కుటుంబం మొత్తం వచ్చి వేదికపై అండగా ఉంటారు. నేనంటే అతనికి అమిత ఇష్టం కొప్పరపు కవులంటే పరమభక్తి కళనే నమ్ముకున్నాడు, కళాకారుల మధ్యనే జీవించాడు ఇలా… అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్ళిపోయాడు జీవితంలో ఎంతో కష్టపడ్డాడు. పిల్లల్ని బాగా చదివించాడు. క్రమశిక్షణగా పెంచాడు. వాళ్ళు ఇంకా చిన్నవారే
‘స్నేహాంజలి’ మూర్తికి స్నేహాంజలి!