- అప్పుల్లో కూరుకుపోయిన బ్రిటన్ భాగస్వామి
- ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న లిబర్టీ స్టీల్
- దివాలా కంపెనీతో ఒప్పందమా అంటూ ప్రతిపక్షాల విమర్శలు
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైసీపీ ఎంపికచేసిన బ్రిటన్ భాగస్వామి లిబర్టీ స్టీల్స్ దివాలాపిటీషన్ దాఖలు చేయడంతో ఇపుడు జగన్ సర్కార్ కు కొత్త తలనొప్ప మొదలైంది. తమను ఆదుకోవాలంటూ లిబర్టీ స్టీల్స్ చేసిన విజ్ఞప్తిని బ్రిటర్ సర్కారు తోసిపుచ్చడంతో ఆ సంస్థ భవిష్యత్ పైనా ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ బ్రిటన్ లోని భారత ఎంబసీని వివరణ కోరినట్లు తెలుస్తోంది. సాధారణ పరిపాలనా ఖర్చులకు డబ్బులేదని, కరోనా నేపథ్యంలో నష్టాలను భరించే శక్తి తమకు లేదని, ఆర్థికంగా చేయూత అందించాలని లిబర్టీ స్టీల్ యాజమాన్యం గతవారం యూకే ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. లిబర్టీ స్టీల్ మాతృ సంస్థ అయిన గుప్తా ఫ్యామిలీ గ్రూప్ కు బ్రిటన్ లోని 12 ప్లాంట్లలో సుమారు 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
కడపస్టీల్ కు మొండి చేయి చూపిన కేంద్ర ప్రభుత్వం :
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం నుంచి ఆశించిన మేర సాయం లభించకపోగా రాష్ట్రంలో ఉన్న వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరిస్తున నేపథ్యంలో ఇక కడప స్టీల్ నిర్మాణానికి విదేశీ భాగస్వాముల అన్వేషణలో పడింది. దీంతో వైఎస్ఈర్ స్టీల్ కంపెనీ లిబర్టీ స్టీల్ ఇండియాను వ్యాపార భాగస్వామిగా ఎంచుకుంది. ఈ మేరకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశంలోనిర్ణయించారు. ఇందుకు లిబర్టీ స్టీల్ కడప స్టీల్ ప్లాంట్ లో అత్యధిక వాటాలు కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. అయితే అంతలోనే లిబర్టీ స్టీల్ కు ఆర్థికంగా కష్టాలు చుట్టుముట్టడంతో ఇపుడు బ్రిటన్ లో ఆ కంపెనీ భవిష్యత్ పైనే నీలినీడలు కమ్ముకున్నాయి.
Also Read: ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈసీ గా నీలం సాహ్ని
ఆర్థికసాయనికి నో చెప్పిన బ్రిటన్ ప్రభుత్వం:
ఆర్థిక సాయం కోరిన లిబర్టీ స్టీల్ విజ్ఞప్తిని బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించింది. కరోనా నేపథ్యంలో పలు సంస్థలు నష్టాల బాటలో పయనిస్తున్నాయని ఇపుడు లిబర్టీ స్టీల్ కు సాయం చేస్తే అదే బాటలో మిగతా కంపెనీలు పయనిస్తాయని బ్రిటన్ ప్రభుత్వ సాయం చేసేందుకు తిరస్కరించింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
భారత ఎంబసీని సంప్రదించిన ఏపీ ప్రభుత్వం:
ప్రస్తుత పరిస్థితుల్లో స్టీల్ పరిశ్రమల్లో పెట్టుబడులకు మన ఉక్కు బ్రిటన్ లో భారత ఎంబసీ ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు నివేదిక కోరినట్లు తెలుస్తోంది. నివేదిక అందిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతిపక్షాల విమర్శలు:
దివాలా కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా చేర్చుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భాగస్వామ్య సంస్థ ఆర్థిక స్థితి తెలుసుకోకుండా ఒప్పందంపై నిర్ణయానికి రావడం సిగ్గు చేటని టీడీపీ ఆరోపిస్తోంది.
Also Read: వైజాగ్ స్టీల్ ను కాపాడుకోండి