- ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించిన జస్టిస్ ఎస్ ఏ బోబ్డే
- ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న బోబ్డే
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ఎన్ వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48 వ చీఫ్ జస్టిస్ గా రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈమేరకు కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు, ప్రధాని నరేంద్ర మోదికి పంపనున్నారు. హోం శాఖ, ప్రధాని పరిశీలన అనంతరం ప్రతిపాదనను రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
Also Read: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్
సీనియారిటీకి ప్రాథాన్యమిచ్చిన జస్టిస్ బోబ్డే:
సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టిన ఎన్వీ రమణ 2000 సంవత్సరం జూన్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికలతో మారనున్న దేశ రాజకీయాలు