- ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం
- ప్రభుత్వ వాదనలు ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై నెలకొన్న సంధిగ్ధత కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో సుధీర్ఘంగా జరిగిన వాదనలు ముగిశాయి. ప్రభుత్వం, ఎన్నికల సంఘం వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఇరువర్గాల వాదనలనను వింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల తరపున దాఖలైన ఇంప్లీడ్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసిన హైకోర్టు
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. షెడ్యూల్ విడుదల చేశాక పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెలిబుచ్చిన ఆందోళనను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. నిన్న ఏజీ వాదనలకు ఎస్ ఈసీ ప్రతివాదనలు వినిపించేందుకు విచారణ ఈరోజుకి వాయిదాపడింది. ఈరోజు ఎస్ఈసీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు విన్న తరువాత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపింది.
ఇది చదవండి: ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ దూకుడు