భారతీయ ఆంగ్ల కవులు-6
కేరళ వాసి జీత్ తాయిల్ కవి, నవలాకారుడే కాక సంగీతకారుడు కూడా. సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అనేక ఇతర అవార్డులు పొందారు. రెండు కవితా సంకలనాలను వేలువరించారు. “పెనిటెంట్” అనే కవితలో ఆధునిక జీవనంలో మనుషుల మధ్య సయోధ్య లేక ఎంత సతమత మవుతున్నారో వివరించారు. ఈ కవితలో ఒక మనషి తన గదిలోని వస్తువులతో మాట్లాడుతుంటాడు. తను తన భార్య నుండి దూరమై ఒంటరి బ్రతుకు బ్రతకలేక ఈ స్థితి వస్తుంది. తను సంతోషంగా ఉన్నట్లు తనకు తనే చెప్పుకునే విఫల ప్రయత్నం చేస్తాడు ఆతను. స్వార్ధం పెరిగి ప్రక్క మనిషిని పట్టించుకోని, స్త్రీని గౌరవ భావంతో చూడని మనస్తత్వంతో నేటి మనషి పడే అవస్థను వివరిస్తాడు కవి. మానవ సంబంధాలు విచిన్న మవుతున్న నిత్య నిజ జీవితానికి అద్దం పడతాడు. స్త్రీ స్వాతంత్ర్యోద్యమాన్ని బలంగా ముందుకు నెట్టే ప్రయత్నం కనిపిస్తుందిక్కడ.
Also read: శివ్ కె కుమార్
Also read: కేకి దారూవాలా
Also read: జయంత్ మహాపాత్ర
Also read: నిస్సిం ఎజేకియల్
Also read: ఎకె రామానుజం