Tuesday, January 21, 2025

టీటీడీ ఈవోగా చేరిన జవహర్ రెడ్డి

పూర్వజన్మ పుణ్యఫలం ఈ నియామకం

భ‌క్తుల సౌకర్యార్థం మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు

కోవిడ్ ను అరికడుతూనే బ్రహ్మోత్సవాలు

తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో)గా ఐఏయస్ అధికారి డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి శనివారం భాద్యతలు చేపట్టారు. తిరుమలకు నడిచి వెళ్ళిన తర్వాత ఆయన మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుమ‌ల శ్రీవారికి  సేవ చేసే భాగ్యం  కలగడం తనకు చాలా సంతోషంగా ఉంద‌నీ, పూర్వజన్మ పుణ్యఫలం కారణంగానే  ఈ భాగ్యం తనకు దక్కిందని డాక్టర్ జవహర్ రడ్డి వ్యాఖ్యానించారు. ‘‘శ్రీవారి పాదాల చెంత నేను నా చదువును పూర్తి చేశాను. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుత్తం ఉన్న పద్దతులను మరింత పటిష్టం చేస్తానను’’ అని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో భ‌క్తుల కోసం మరిన్ని సంస్కరణలు తీసుకొస్తాన‌ని తెలిపారు. పూర్తి జాగ్ర‌త్త‌లు తీసుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి అరికట్టవచ్చన్నారు. అన్‌లాక్‌ 5లో భాగంగా మినహాయింపులు ఇచ్చారని, టిటిడి ఉన్నత అధికారులతో బ్రహ్మోత్సవాలపై  సమావేశం నిర్వహించి తగిన సూచనలు తెలియ‌జేస్తామ‌ని జవహర్ రెడ్డి అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles