భాషయె జాషువా జనని, భావ ప్రపంచము తండ్రి, పద్యమం
జూషయె పత్ని, దీనజన
శోకమె సప్త మహాసముద్రపుం
ఘోష, ప్రభంజనమ్మటుల ఘూర్ణిలుటే కవితాసమాధిరా!
——–
శేషఫణీంద్రు భంగి విషజిహ్వలు సాచెడు వర్ణభేద వి
ద్వేషము లంతరించుటయె
ధ్యేయము, శూన్య గృహాల యందె
సంతోషము, తైలపాయికలు, అధోగతులే తన కాప్తబంధువుల్!
——–
శోషిలు జీర్ణ గేహమిది సుప్త నిశీధిని చూడు తమ్ముడూ!
జాషువ జాడకై వెదకు సాచిన రెక్కల గబ్బిలంబిటన్!
నివర్తి మోహన్ కుమార్
(సోమవారం, 24 జులై 2023 జాషువా వర్ధంతి. ఆ మహాకవి చైతన్యస్మృతికి అంకితమీ పద్యం. తైలపాయిక అనగా గబ్బిలం)