భారత దేశం సర్వసత్తాక ప్రభుత్వంగా
స్వలిఖిత రాజ్యాంగాన్ని
తమ దిశా నిర్దేశకంగా
ప్రకటించుకున్న రోజు
స్వతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలకు
ఫలితం లభించిన రోజు
స్వతత్రం సాధించిన అనేక దేశాలు
ప్రజాస్వామ్యాలుగా మనలేక పోయినా
భారతంలో ప్రజాస్వామ్య వేళ్లు బలపడిన రోజు
శాసన, నిర్వహణ, న్యాయ పరిధులు
నిర్వచించ బడిన రోజు
అనేక అనుబంధ సంస్థలు
రాజ్యాంగ స్ఫూర్తిని పటిష్ఠం చేసిన రోజు
దేశ రక్షణకు, సమాజ సేవకు
జీవితం అంకితం చేసుకున్న వారిని
గర్తించి గౌరవించే రోజు
పెద్దలు మన బాగు కోసం ఏర్పరచిన
సామాజిక సూత్రాలు పాటించడానికి
మనం పునరంకితం కావలసిన రోజు
భారత రిపబ్లిక్ ఆవిర్భవించిన రోజు
మనం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవలసిన రోజు.
Also read: నా రాత
Also read: మేధావి
Also read: అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం
Also read: వెనక్కి నడుద్దామా
Also read: వరం