జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లో చేరారు. సీఎం జగన్ వెంకట్ రామ్ కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సమయంలో వెంకట్ రామ్ తండ్రి వరప్రసాద్ ఆయన వెంటే ఉన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పనితీరు మెచ్చి వైసీపీలో చేరినట్లు వెంకట రామ్ తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకుని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తండ్రి సమక్షంలో వైసీపీలో చేరిన వెంకట్ రామ్ పార్టీ అభ్యున్నతికి కృషిచేస్తానని తెలిపారు.