- సంప్రదాయ వస్త్రాలు ధరించిన పవన్
- వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (జనవరి 22) ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో పవన్ కల్యాణ్ సంప్రదాయ వస్త్రాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
ఇది చదవండి: తిరుపతిలో పోటీకి జనసేన సై?
పవన్ కల్యాణ్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇది చదవండి: ముఖ్యమంత్రి మతసామరస్యాన్ని కాపాడలేరా -పవన్
కరోనా వైరస్ ప్రభావంతో శ్రీవారిని దర్శించుకోలేకపోయానని కరోనా తగ్గుముఖం పట్టడంతో స్వామివారిని దర్శించుకున్నట్లు పవన్ తెలిపారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో శ్రీవారిన దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఆలయం వద్దకు చేరుకున్నారు.