శనివారంనాడు కీలక ప్రకటన
హైదరాబాద్ : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జోగుగా జరుగుతోంది. ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలు, అనుచరులతో అయన రహస్య సమావేశమైనట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తనను టీఆర్ఎస్ కోవర్ట్ అంటూ ప్రచారం చేయడంపై జగ్గారెడ్డి తీవ్ర మనస్తాపం చెందాడంతో అయన పార్టీని వీడుతున్నాట్లు తెలుస్తోంది. శనివారం రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై జగ్గారెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్లు అయన అనుచరులు చెబుతున్నారు. గతంలో జగ్గారెడ్డి బిజెపి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. కేవలం కొన్ని నెలలు మాత్రమే ఆ పార్టీలో కొనసాగారు.