- మొదటి మ్యాచ్ లో శ్రీలంకపై ఇన్నింగ్స్ 222 పరుగుల ఆధిక్యంతో గెలుపు
- జయంత్ యాదవ్ కోసం ఓవర్లు త్యాగం చేసిన జడేజా, అశ్విన్
రవీంద్ర జడెజా రఫాడించాడు బ్యాట్ తోనూ, బాల్ తోనూ. ఒంటి చెత్తూ తొలి మ్యాచ్ ను మూడురోజులలో ముగించి ఇన్నింగ్స్ తేడాతో బారత్ కు విజయం సాధించిపెట్టాడు.
175 పరుగులు చేసి, రెండు వందల పరుగులకు పాతిక మాత్రమే తక్కువ వున్న సమయంలో భారతజట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం కొద్దిగా వివాదాస్పదమైంది. అయితే తాను డిక్లేర్ చేయమని కోరినట్టు జడేజా చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే క్రికెట్ చరిత్రలో జడేజా కంటే తక్కువ పరుగుల దూరంలో బ్యాట్స్ మన్ ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఉతంతాలు ఉన్నాయి. 1960లో ఫ్రాంక్ వోరెల్ 197 పరుగుల దగ్గర బ్యాట్ చేస్తున్నదశలో ఇన్నింగ్స్ ముగిసిందని గెర్రీ అలెగ్జాండర్ ప్రకటించాడు. 2004లో ముల్తాన్ మ్యాచ్ లో టెండూల్కర్ 194 పరుగుల మీద ఉండగా జట్టు నాయకుడు రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్స్ ను ముగించాడు. గ్రీమ్ హిక్ 98 పరుగుల మీద శతకానికి రెండుపరుగుల దూరంలో ఉన్నప్పుడు, కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా 93 పరుగుల దగ్గర ఉన్నప్పుడు 1991లో సియాల్ కోట్ మ్యాచ్ లో ఇమ్రాన్ ఖాన్ డిక్లేర్ చేశాడు.
మొదటి టెస్ మూడో రోజు అయిన ఆదివారంనాడు కపిల్ దేవ్ అత్యధికుల వికెట్ల రికార్డును రవిచంద్రన్ అశ్విన్ అధిగమించాడు. దేశంలో అశ్విన్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో రెండో మేటి. మొదటి స్థానం అనీల్ కుంబ్లేకి పదిలంగా ఉంది. మొహాలీ లో చరిత్ అసలంకా వికెట్టును పడగొట్టినప్పుడు కపిల్ దేవ్ మొత్తం 434వ వికెట్ల లక్ష్యాన్ని అశ్విన్ ఛేదించాడు. శ్రీలంకను రెండు ఇన్నింగ్స్ లో 174, 178 పరుగులకు ఔట్ చేసిన ఫలితంగా ఇండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో సునాయాస విజయం నమోదు చేసుకున్నది. ఇండియా మొదటి ఇన్నింగ్స్ ను ఎనిమిది వికెట్లకు 474 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
మ్యాచ్ అయిపోయిన తర్వాత అశ్విన్ మాట్లాడుతూ జడేజాను ఆకాశానికెత్తాడు. మొదటి ఇన్నింగ్స్ లో 175 పరుగులు చేయడమే కాకుండా శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో అయిదు వికెట్లూ, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసుకొని విజయానికి ప్రధాన కారకుడైనాడని ప్రస్తుతించాడు. భారతజట్టులో మూడో స్పన్నర్ జయంత్ యాదవ్ కి మరికొన్ని ఓవర్లు ఇవ్వడం కోసం తాను, జడేజా కొన్ని ఓవర్లను త్యాగం చేసినట్టు అశ్విన్ వెల్లడించాడు. ‘మాలో మేము మాట్లాడుకుంటున్నప్పుడు జయంత్ కు బౌలింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదని గ్రహించాం. జట్టులో మూడో స్పన్నర్ గా ఆడుతున్న వ్యక్తికి బౌలింగ్ అవకాశాలు రాకపోతే కష్టం. అతడికి కొన్ని ఓవర్లు కేటాయించాలని రోహిత్ కూడా భావించాడు. ఆ సమయంలో మూడో స్పన్నర్ కి ఓవర్లుఇవ్వడానికి ఎవరు త్యాగం చేస్తారనేది ముఖ్యం. తాను బౌలింగ్ చేసే చివరలో పిచ్ తిరుగుతోంది కనుక జయంత్ కి తాను అవకాశం ఇస్తానని జడ్డూ (జడేజా) ముందుకు వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత రెండో చివరలో నేను కూడా వదిలేశాను. జట్టులో మూడో స్పన్నర్ గా ఉండటం తమాషా కాదు. జడ్డూ ముందుగా తన ఓవర్లను వదులుకోవడంలో విశాల హృదయంతో వ్యవహరించాడు,’’అని అశ్విన్ అన్నాడు.