ఇషాన్ కిషన్ క్రిస్ గిల్ రికార్డును బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్ తో శనివారంనాడు జరిగన మూడవ ఒన్ డే లో ఒక వికెట్ పతనం తర్వాత రంగంలో దిగి తొమ్మిది సిక్సర్లు, 23 బౌండరీలతో 126 బంతులలో 200 పరుగులు సాధించాడు. మొదటి వంద పరుగులను 85 బంతులలో పూర్తి చేశాడు. చివరికి 24 బౌండరీలూ, పది సిక్సర్లతో 210 పరుగులు చేశాడు.ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్ నిరుడు ఇంగ్లండ్ పైన ఆడిన భారత జట్టులో తొట్టతొలిగా ఆడాడు.జార్ఖండ్ కు ఆఢతాడు. ప్రీమియర్ లీగ్ పోటీలలో బాంబే జట్టులో ఆడతాడు. ఇరవై నాలుగేళ్ల కిందట పట్నాలో జన్మించాడు.
ప్రపంచ కప్ పోటీలలో వెస్టిండీస్ బ్యాట్స్ మన్ క్రిస్ గెయిల్ జింబాబ్వేపైన 2015లో ఆడుతూ 138 బంతులలో డబుల్ సెంచరీ అత్యంత వేగంగా సాధించాడు. ఇషాన్ ఇప్పుడు అంతకంటే వేగంగా 126 బంతులలోనే ద్విశతకం బాదేశాడు. ద్విశతకం చేసిన క్రికెటర్లలో అత్యంత పిన్న వయస్కుడుగా కూడా రికార్డు నమోదు చేశాడు.
రోహిత్ శర్మకు గాయం కావడం వల్ల ఇండియాకు తిరిగి రావడంతో మూడో ఒన్ డేలో ఆడే అవకాశం యువక్రికెటర్ల ఇషాన్ కిషన్ కు దక్కింది. ఒన్ డే క్రికెట్ లో ద్విశతకాలు సాధించిన భారత క్రీకెటర్లలో నాలుగో వాడిగా ఇషాన్ తన పేరు నమోదు చేసుకున్నాడు. తక్కిన ముగ్గురు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహవాగ్, రోహిత్ శర్మ. ప్రపంచం మొత్తం మీద ఒన్ డేలలో డబుల్ సెంచరీ చేసిన ఘనులలో ఏడవ వాడుగా ఇషాన్ నిలిచాడు. మిగతా ముగ్గురూ వీరు: న్యాజిలాండ్ కి చెందిన మార్టిన్ గుప్టిల్, వెస్ట్ ఇండీస్ కి చెందిన క్రిస్ గేయల్, పాకిస్తాన్ బ్యాట్స్ మన్ ఫకర్ జమాన్.