కేసీఆర్ చేసేది చెప్పడు… చెప్పింది చెయ్యడు ఇది ఆయన వ్యవహారశైలి! ఎన్ని యు టర్న్ లు తీసుకున్న రాజకీయ ఎత్తులు వేయడం లో కేసీఆర్ దిట్ట! ఇప్పుడు రాష్ట్ర ఆర్జిక పరిస్థితి బాగాలేదు! ఆయన విజన్ లో ప్రాజెక్టులకు నిధులు అన్ని నీళ్ల పాలు అవుతున్నాయి… దానికి తోడు నెగిటివ్ ఓటింగ్ పెరుగుతుంది… లక్ష ఉద్యోగాల కల్పన కేసీఆర్ మెడ మీద ఉన్న కత్తి…
ఇవ్వన్నీటికి తోడు కేంద్రంలో ఆశాజనక ప్రతిపక్షం లేదు! పరిపక్వత గల నాయకుడు సమీప దూరంలో కనిపించడం లేదు..బీహార్ లో నితీష్ కు వెన్ను పోటు పొడిచే స్థితిలో బిజెపి పావులు కడుపుతుంది…అఖిలేష్ యాదవ్, మాయావతి గ్లామర్ తగ్గింది… దక్షిణాదిలో రజనీ హోప్స్ నీరుగారి పోయాయి…రాహుల్ సోనియా చరిష్మా తగ్గడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ యు టర్న్ తీసుకున్నాడు తప్పా, బిజెపి కి భయపడి లేదా అక్రమ ఆస్తుల కేసులో కేసీఆర్ ను ఇరికించే ఆలోచన చేస్తుంది అనడంలో నిజం ఎంత ఉందో అబద్ధం అంతే ఉంది! మోడీ ప్రపంచ దేశాల రాజకీయ వ్యూహాలు, చైనా – పాకిస్థాన్ ఎత్తులు పై ఎత్తులతో సతమతమవుతున్న మాట వాస్తవం! దేశ రాజకీయాల్లో సమీప భవిష్యత్ లో మోడీకి ధీటైన ప్రత్యర్థి లేడు! ఈ దశలో కేసిఆర్ యు టర్న్ వెనుక రాజకీయ పరిణామాలు వేరే ఉన్నాయి…ఇటు బి గ్రూప్ గా అసదుద్దీన్ ఒవైసీ దేశ రాజకీయాల్లో షైన్ అవుతున్నాడు…రాష్ట్రంలో కూడా ఎంఐఎం రాజకీయ శక్తిగా ఎదుగుతుంది… నిజానికి ఎంఐఎం – బిజెపి పంచాయతీని కేసీఆర్ మోయనవసరం లేదు! ఎవరికి మద్దతు ఇచ్చినా కేసీఆర్ కు ఒరిగేదేం లేదు! అందుకే తన రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ పావులు కదుపుతున్నాడు! రాష్ట్రంలో భవిష్యత్ లో కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది…ఇక కేసీఆర్ తన స్థానంలో కొడుకు కు ముఖ్యమంత్రి పదవీ కట్టబెట్టడం తక్షణ కర్తవ్యం! ఈ అధికార బదిలీ జరగాలి అంటే కేసీఆర్ కు బీజేపీ అండదండలు కావాలి…సరికొత్త టీం కేటీఆర్ కు ఇచ్చి మొత్తం పార్టీ ప్రక్షలన దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నాడు! ఈ దశలో బిజెపి తో కేంద్రంలో సఖ్యత తో పాటు మంత్రివర్గంలో చేరడానికి కూడా కేసీఆర్ మక్కువ చూపిన ఆశ్యర్యం లేదు..ఎందుకంటే మరో మూడేళ్లు రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత కావాలి అంటే కేసీఆర్ కు బిజెపి తో దోస్తీ అవసరం! తెలంగాణ తెచ్చిన ఘనతను అవినీతి ఆరోపణలతో బిజెపి వలలో చిక్కడం కేసీఆర్ కు ఇష్టం లేదు! తన తెలంగాణ ప్రయోజనాలే ఇష్టంగా కేసీఆర్ పావులు కదువుతున్నాడు!!
ఇది చదవండి: బిజెపి దూకుడుకు కేసీఆర్ కళ్ళెం వేస్తారా?
కేటీఆర్ కు సి ఎం పదవి:
వచ్చే ఉగాది నాటికి కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తధ్యం ఎందుకంటే ఆయన పాలన మరో మూడేళ్లు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో తన వ్యక్తిగత సరళికి వస్తాడు! వచ్చే కొద్ది రోజుల్లో రాష్ట్రం లో వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ దశలో కేటీఆర్ తన సరికొత్త టీం ను చూసుకుంటున్నడని వార్తలు గుప్పు మంటున్నాయి! బావ మరిదికి మద్దతు ఇవ్వడానికి హరీష్ రావు కూడా ముందుకు వచ్చాడు…సమీప భవిష్యత్తులో లో మెదక్ నుండి కేసీఆర్ పార్లమెంట్ కు వెళ్లాలని ఆలోచన కూడా చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా కథనం! ఈ వార్త ద్వారా బిజెపి నాయకులు విమర్శలు తగ్గాయి…కాంగ్రెస్ రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బ తినడం ఒకరిద్దరు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునే స్థితిలో ఉండడం వల్ల బిజెపి ఇక రాష్ట్రంలో రెండో వ స్థానం అక్రమించడం ఖాయం ! ఇటు ఒవైసీ తో స్నేహం అటు బిజెపి తో దోస్తీ దిశగా కేసీఆర్ వేస్తున్న పాచికలు వల్ల రాష్ట్ర రాజకీయ విజన్ లో కేసీఆర్ పట్టు సాధించడం మాట ఎలా ఉన్నా, బిజెపి తో ఘర్షణ ధోరణి మాత్రం పోయింది…ఇక కేసీఆర్ తక్షణ కర్తవ్యం కేటీఆర్ ను సి ఎం పదవిలో కూర్చొబెట్టడమే అనేది రాజకీయ పండితులు జోస్యం!!
ఇది చదవండి: రైతు ఉద్యమంపై కేసీఆర్ యూటర్న్
మీ విశ్లేషణ చాలా బాగుంది