ఒకప్పుడు
అక్కడ ఓ ఇల్లు ఉండేది
మూడు బావులుండేవి
జీవం వుండేది
జీవనది లాంటి మనుషులు వుండేవాళ్ళు
అందరికీ భోజనమే కాదు
మందులను ఇచ్చిన చేతులు ఉండేవి.
తొమ్మిది మందికే కాదు
మరెంతో మందికి జన్మనిచ్చింది ఆ ఇల్లు
తొమ్మిది మంది శాఖోపశాఖలై
విశ్వవ్యాప్తం అయినారు
ఇల్లూ
తల్లీ
తండ్రీ
వయసుడిగి
జీవనం చాలించారు
తొమ్మిది మందిలో
అయిదుగురు అర్ధాంతరంగా
తమ జీవనాన్ని ముగించారు
కరోనా కర్కశ కాటుకి
మరొకరు బలైపొయారు
ఇప్పుడు
తొమ్మిది లో మిగిలింది
ముగ్గురే
ఒక్కో చోట ఒకరు
ఒకప్పుడు అక్కడో ఇల్లుండేది
ఇప్పుడు
దాని ఆనవాళ్లు మాత్రమే
కాలం కాఠిన్యానికి
ఇల్లేమిటీ
మనుషులేమిటీ
అన్నీ
కరిగిపోయాయి
ఇల్లుదేముందీ
ఇవ్వాళ కాకపోతే
రేపు
మరో రూపంలో
దర్శనం ఇస్తుంది
అర్ధాంతరంగా పొయిన
మనుషులు
జ్ఞాపకాలు గా
మరో రూపంలో
కనిపిస్తారా ..?
ఏవైనా అట్లాగే ఉండాలనుకోవడం
ఎంత సహజమో
అలా లేవని
బాధ పడటం అంతే సహజమేమో !!
Also read: నో …ఓపెన్ సెసేం
Also read: బ్రహ్మకమలం
Also read: నాలుగు పాదాల మీద న్యాయం …
Also read: ప్రార్ధన
Also read: పరిమళం
Nice elegy poem sir….I hope its ur boyhood days