- టిఆర్ఎస్ నెగిటివ్ ఓటు కు చెక్ పెట్టిన గులాబీ నేత!
- ఒక దెబ్బకు మూడు పిట్టలు
- జ్యోతి బస్ రికార్డు అసాధ్యం
టీఆర్ఎస్ నెగిటివ్ ప్రచారాలు మొదలయ్యాయి…జ్యోతి బసు లాంటి ముఖ్య మంత్రుల రికార్డు కేసీఆర్ కు అసాధ్యం. బసు లాంటి ముఖ్యమంత్రులు నేడు లేరు.1977 నుండి 2000 వరకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా అయిన జ్యోతిబసు అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి గా కూడా పనిచేశారు. అలాంటి నేతలు ఇంకా భారత రాజకీయ రంగంలో వస్తా రనుకోవడం పెద్ద భ్రమ. తెలంగాణ లో ఒక వైపు బిజెపి దూకుడు మరోవైపు సొంత పార్టీలో లుకలుకలు…మరో వైపు ఇంట్లో సన్ స్ట్రోక్ . కేసీఆర్ పెద్ద వ్యూహమే రచించాడు. జగన్ తో ఉన్న సన్నిహిత్యం, తెలంగాణ లో స్వర్గీయ వై ఎస్ రాజశేఖర రెడ్డి కి ఉన్న ప్రజాభిమానం ఇప్పుడు టిఆర్ఎస్ కోట గోడలు కూల్చకుండా రాజకీయ పావులు కేసీఆర్ మెల్లిగా కదిపారు. బిజెపి తెలంగాణ లో బలపడడం, ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఎదగడం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ దిశలో ఏకైక తురువు ముక్క వై ఎస్ కుమార్తె షర్మిల కనబడ్డారు. తెలంగాణాలో బిజెపి ఓటు బ్యాంక్ ను దెబ్బతీసే వ్యూహం కేసీఆర్ రచించారు.
Also Read : తెలంగాణలో రాజన్న రాజ్యం
ఇప్పుడు రాజకీయ నాయకుల వలస బిజెపి నుండి షర్మిల పార్టీ వైపు మొదలవుతుంది. అందరికి అర్థం కానీ విషయం వచ్చే ఏడాది జరగబోయే జమిలి ఎన్నికలు. అలా కేంద్రంలో వేగంగా జరుగుతున్న పరిణామాల్లో టిఆర్ఎస్ ను చీల్చి బీజేపీ ఆ చీలిన పార్టీ తో పొత్తు కుదుర్చుకునే దిశగా మంతనాలు జరిగినట్టు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా టీఆర్ఎస్ నేతకు తారు అందినట్టుంది. కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, రసమయి బాల కిషన్ కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారు. మరో 32 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త దారి కోసం వెతుక్కుంటున్న దశలో తన కొడుకు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠం కట్ట బెట్టడం వల్ల టీఆర్ఎస్ తన గోతిని తానే తవ్వు కుంటున్నట్టు అవుతుందని అయన గమనించారు… కాంగ్రెస్ లో కూడా ప్రజాభిమానం గల నేత లేక పోవడం, వచ్చే ఎన్నికల నాటికి బిజెపి కాంగ్రెస్ సీట్లను ఆక్రమించే సూచనలు కేసీఆర్ కనిపెట్టారు. ఈ దశలో కాంగ్రెస్ లో అసంతృప్తి వాదులను షర్మిల పార్టీ వైపు ఆకట్టుకునేలా చేస్తే బిజెపికి చెక్ పెట్టె వ్యూహం రచించి కేసీఆర్ దీర్ఘకాలిక ఆలోచన చేశారు.
Also Read : అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాల్లేవు – సజ్జల
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే టిఆర్ ఎస్ లో అసమ్మతి ఉవ్వెత్తున లేచేది. నిజానికి ఇంట్లో కేసీఆర్ కి సన్ స్ట్రోక్ ఉంది. కేటీఆర్ బంధువులు సీఎం పీఠం పై కూర్చో బెట్టి కేసీఆర్ ను ఫార్మ్ హౌస్ కు పరిమితం చేసే పన్నాగాలు జరిగాయి. ఉద్యమ నాయకుడు రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ మౌనంగా అన్ని చూశారు. కేటీఆర్ సమర్థుడే గానీ పరిపాలన అనుభవం లేదు. దానికి తోడు తండ్రిలా ఎత్తుకు పై ఎత్తులు వేసే వ్యూహ రచన చేయ లేరు. కేటీఆర్ సమర్థవంతమైన ఉద్యోగి కానీ కంపెనీ నడిపించే యజమాని కాజాలడు. ఇవన్నీ కేసీఆర్ గమనించి కొడుకు సీఎం పదవి పై ఊహాగానాలు వదిలాడు…దాంతో టిఆర్ఎస్ లో అసమ్మతి భగ్గు మంది… ఇక కేటీఆర్ ఆశలు అడియాసలైనాయి.
Also Read : షర్మిలకు తెలంగాణలో బ్రహ్మరథం- కొండా రాఘవ రెడ్డి
ఈ దశలో సరికొత్త రాజకీయ పార్టీ వస్తే తనకు అనుకూలంగా ఉంటుందనేది కేసీఆర్ ఆలోచన కావచ్చు. హైద్రాబాద్ ను సుందర నగరంగా ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, ఎన్నో ప్లై ఓవర్లు, విమానాశ్రయానికి నేరుగా పీవీ నరసింహారావు హైవే ఇలా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసిన వై ఎస్ కుటుంబం పైన తెలంగాణ లో సానుభూతి ఉంది. క్రిస్టియన్ ఓటు బ్యాంకు కూడా తెలంగాణ లో గణనీయంగా ఉంది. బిజెపికి రామ మందిర్ నిర్మాణం వల్ల దేశంలో, రాష్ట్రంలో హిందుత్వ ఓట్లు బాగా పెరిగాయి. అలాగే కాంగ్రెస్ లో జనాదరణ కలిగిన నాయకుడే లేడు. కాంగ్రెస్ లో కసి మీద ఉన్న రేవంత్ కు, ఇటు బిజెపి లో దూకుడు మీద ఉన్న బండి సంజయ్ కు దిమ్మ తిరిగేలా షర్మిల రాజకీయ రంగ ప్రవేశం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు! మాయల మరాఠీ, మాటల మాంత్రికుడు కేసీఆర్ వేసే ఎత్తులు మునుముందు ఎలా ఉంటాయో వేచి చూద్దాం!
Also Read : దూసుకుపోతున్న జగనన్న విడిచిన బాణం
Also Read : ఇష్టంలేకుండానే కొనసాగుడా…?