Thursday, December 26, 2024

ఐపీఎల్ -14 వేలం వేదిక చెన్నై

  • వేలానికి 57 మంది ఆటగాళ్లు
  • 196 కోట్లతో వేలం కార్యక్రమం

ఐపీఎల్ 2021 వేలం వేదికగా చెన్నైని ఐపీఎల్ బోర్డు ఖరారు చేసింది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఐపీఎల్ -14 మినీ వేలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బోర్డు ట్వి్ట్టర్ ద్వారా వెల్లడించింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 139 మంది ఆటగాళ్లను తమతోనే అట్టిపెట్టుకోగా 57 మంది ఆటగాళ్లను విడిచి పెట్టాయి. దీంతో స్టీవ్ స్మిత్,గ్లెన్ మాక్స్ వెల్, ఆరోన్ ఫించ్, హర్భజన్ సింగ్, లాసిత్ మలింగ, పియూష్ చావ్లా, కేదార్ జాదవ్, క్రిస్ మోరిస్, మిషెల్ మెక్ లెంగ్లాన్, మోయిన్ అలీ లాంటి మేటి ఆటగాళ్లందరూ వేలం ద్వారా అందుబాటులోకి వచ్చారు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ పార్థివ్ పటేల్ రిటైర్మెంట్ ప్రకటించగా…సీనియర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మాత్రం తాను అందుబాటులో ఉండబోనని తేల్చి చెప్పాడు.

రాజస్థాన్ రాయల్స్ కు స్టీవ్ స్మిత్ స్థానంలో సంజు శాంసన్ నాయకత్వం వహించనున్నాడు. వాస్తవానికి జనవరి 20తోనే ఐపీఎల్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా  ఆయా  ఫ్రాంఛైజీలు  పలువురు ఆటగాళ్లను కూడా  వదిలించుకొన్నాయి. వివిధ ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల పరస్పర బదిలీ గడువు మాత్రం ఫిబ్రవరి 4 వరకూ ఉంది.

196 కోట్లరూపాయలతో వేలం :

ఈ ఏడాది వేలంలో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తమ అవసరాలకు తగిన ఆటగాళ్ల కోసం రూ.196కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నాయి.

వేలానికి ఉంచిన వివిధ దేశాల క్రికెటర్ల వివరాలు :

 స‌్టీవ్ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఫించ్‌, క్రిస్ మోరిస్‌, కేదార్ జాద‌వ్‌, ముర‌ళీ విజ‌య్‌, పియూష్ చావ్లా, అలెక్స్ కేరీ, కీమో పాల్‌, తుషార్ దేశ్‌పాండే, సందీప్ లామిచానె, మోహిత్ శ‌ర్మ‌, జేస‌న్ రాయ్‌, షెల్డ‌న్ కాట్రెల్‌, ముజీబుర్ రెహ‌మాన్‌, హార్డ‌స్ విలియోన్‌, జేమ్స్ నీష‌మ్‌, క్రిష్ణ‌ప్ప గౌత‌మ్‌, క‌రుణ్ నాయ‌ర్‌, జ‌గ‌దీశ సుచిత్‌, తేజింద‌ర్ సింగ్ ధిల్లాన్‌, క్రిస్ గ్రీన్‌, హ్యారీ గుర్నీ, ఎం. సిద్దార్థ్‌, నిఖిల్ నాయ‌క్‌, సిద్ధేశ్ లాడ్‌, టామ్ బాంట‌న్‌, ప్రిన్స్ బ‌ల్వంత్ రాయ్‌, దిగ్విజ‌య్ దేశ్‌ముఖ్‌, నేథ‌న్ కూల్ట‌ర్‌నైల్‌, జేమ్స్ పాటిన్‌స‌న్‌, షెర్ఫానె రూథ‌ర్‌ఫ‌ర్డ్‌, మిచెల్ మెక్‌క్లెన‌గ‌న్‌, ఆకాశ్ సింగ్‌, అనిరుద్ధ జోషి, అంకిత్ రాజ్‌పుత్‌, ఒషానె థామ‌స్‌, శ‌శాంక్ సింగ్‌, టామ్ క‌ర‌న్‌, వ‌రుణ్ ఆరోన్‌, శివ‌మ్ దూబె, ఉమేష్ యాద‌వ్, మోయిన్ అలీ, పార్థివ్ ప‌టేల్‌, ప‌వ‌న్ నేగి, ఇసురు ఉడానా, గురుకీర‌త్ మ‌న్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, సందీప్ బ‌వ‌నాకా, ఫాబియ‌న్ అలెన్‌, సంజ‌య్ యాద‌వ్‌, పృథ్విరాజ్ య‌ర్రా. ఐపీఎల్ మొత్తం 13 సీజన్ల చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదుసార్లు విజేతగా నిలిస్తే…చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018 సీజన్లలోనూ, కోల్ కతా నైట్ రైడర్స్ 2012, 2014 సీజన్లలో టైటిల్ నెగ్గాయి. ప్రారంభ ఐపీఎల్ చాంపియన్ గా నిలిచిన ఘనతను మాత్రం రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles