- స్మిత్ కు జైపూర్, వాట్సన్ కు చెన్నై గుడ్ బై
- రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్
ఐపీఎల్ 2021 టోర్నీకోసం తాము ఆట్టిపెట్టుకొన్న ఆటగాళ్లు, వదిలేసుకొన్నఆటగాళ్ల వివరాలను మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల యాజమాన్యాలు ప్రకటించాయి. భారీమొత్తంలో కోట్ల రూపాయలు తీసుకొంటూ స్థాయికి తగ్గట్టుగా ఆడని ఆటగాళ్లను వదిలించుకోడానికే ఫ్రాంచైజీలు అధికప్రాధాన్యమిచ్చాయి. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు నాయకత్వం వహించిన స్టీవ్ స్మిత్ ను జైపూర్ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది.
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ …వెటరన్ ప్లేయర్లు షేన్ వాట్సన్, హర్భజన్ సింగ్,పియూష్ చావ్లా, కేదార్ జాదవ్ లకు గుడ్ బై చెప్పింది. తెలుగు తేజం అంబటి రాయుడును కొనసాగించాలని చెన్నై ఫ్రాంచైజీ నిర్ణయించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్…కంగారూ కెప్టెన్ ఆరోన్ ఫించ్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ లను వదులుకొంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సైతం యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ,కీవీ పేసర్ మెక్ లెంగ్లాన్, పాటిన్సన్, కౌంటర్ నైల్ లను విడిచి పెట్టింది. తమపాలిట తెల్లఏనుగల్లా మారిన గ్లెన్ మాక్స్ వెల్, షెల్డన్ కోట్రెల్, జిమ్మీ నీషమ్ లను వదిలించుకొంది. హైదరాబాద్ సన్ రైజర్స్ తన ప్రధాన ఆటగాళ్లందరినీ కొనసాగించనుంది. వివిధ ప్రాంచైజీలు అక్కరలేదని విడిచిపెట్టిన ఆటగాళ్లందరినీ వారివారి స్థాయిని బట్టి కనీసధర తో వేలానికి ఉంచనున్నారు. ఫిబ్రవరి రెండోవారంలో మినీ వేలం కార్యక్రమాన్నిఐపీఎల్ బోర్డు నిర్వహించనుంది.