- గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యే లపై నిఘా
- హైదరాబాద్ కు కర్ణాటక ఎమ్మెల్యే లు
- హైద్రాబాద్ కు ఎఐసీసీ నేతలు రాక
- అనుమానమా, పట్టుకోసమా
- నేడు ఎన్నికల కౌంటింగ్
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం జరగనున్నది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీజేపీ, బిఆరెస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. ఐతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని సర్వేలు చెప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉక్కంఠ నెలకొంది. గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి ఆ పార్టీ అధిష్ఠానం ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి బోటాబొటిగా ఎమ్మెల్యేలు గెలిస్తే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో అన్న ఎత్తుగడలో యోచిస్తుంది. ఆదివారం కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే లను ఎక్కడికి తరలించాలన్న యోచన లో అధిష్ఠానం వుంది. పూర్తి మెజార్టీ కాంగ్రెస్ కు వస్తుందా లేదా అన్న మీ మాంసలో కాంగ్రెస్ లోలోన భయాందోళన చెందుతోంది. మరోవైపు కేసీఆర్ వేసే ఎత్తుగాడలో కాంగ్రెస్ లో ఎలాంటి గంధరగోళం నెలకుంటుందోనని కాంగ్రెస్ లో తెలియని ఆందోళన నెలకొన్నది. ఇప్పటికి గెలుస్తామన్న పార్టీ అభ్యర్థుల వద్దకు కర్ణాటక ఎమ్మెల్యేలను పంపుతున్నారు. గెలిచే ఎమ్మెల్యే లపై అనుమానమా లేక వారికి రక్షణంగా ఉండడానికి కర్ణాటక ఎమ్మెల్యేలను పంపుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు రావద్దని కాంగ్రెస్ అధిష్టానం సంకేతలు పంపింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతోందని ఇతర పార్టీలు ఉలిక్కి పడుతున్నాయి. ఒకవేళ హంగు వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 65 సీట్ల కంటే ఎక్కువ వస్తే తప్పా ప్రభుత్వం ఏర్పాటు చేయలేమా అన్న ఆందోళన వ్యకం అవుతోంది. శనివారం రాత్రికి కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకుంటారు. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. పార్టీల నేతల్లో కౌంటింగ్ పై ఆందోళన, ఉత్కంఠత నెలకుంది.