నిన్నటిదాకా నేనొక స్తంభాన్ని
సింధు లోయలో నా గోరీని
తవ్వి చూసుకుంటున్నవాణ్ని
కాని నా గోరీలోని నా శవాన్ని కూడా
నాకు తెలియకుండా తినేసిన
ఈ కంబంధుల్ని ఏం చెయ్యాలి?
నేడు నేనొక తేజాన్ని
జనాన్ని కదిలించే ప్రభంజనాన్ని
మత్తు వదిలించే ఉత్తుంగ గంగా తరంగాన్ని
హనుమంతుడిని
వీరభద్రుడిని
అరె
ఆవేశంలో మెలకువ వచ్చేసినట్లుందే!
Also read: అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం
Also read: వెనక్కి నడుద్దామా
Also read: వరం
Also read: జీవిత సత్యం
Also read: సహచరిత