Sunday, December 22, 2024

అవ “మానాలై”

ఇప్పుడంతా

బహిరంగమే

అంగాలు

అంతరంగాలు

బహిరంగమే !

బహిరంగ మలాలై

బహిరంగ మూత్రాలై

దారి పక్క దిగబడిన

దుఃఖాలై

వాహనాల వెలుతురు

పడగానే

లేచి నించున్న

అవ మానాలై

మళ్ళి మళ్ళి

మోసపోయిన

మానాలై

అధికారులేదో

ఏర్పాటు చేస్తారని

ఎదురు ఎదురు

చూసి

ఐదేళ్ళ కొక సారి

మానభంగాలైన

ఓటు కన్య లై

**

నీ చరిత్ర రక్తం తో

మొదలయిందని తెలుసు

రక్తం నుండి రక్తం వరకూ

నెల అని నీకు తెలుసు

అధికార మదం

అంధురాలిగా

చేస్తే

ముట్టు గుడ్డ అడిగిన

పాపానికి

ఆడదానివని మరిచి

పుష్పవతి మతిని

చితక గొడతావా?

రేపటి నుండి

అమ్మమ్మ దుమ్ము బట్టలో,

అమ్మ పాత బట్ట లో,

చుట్టుకని

అవమానాల

మానాలై

ఫంగస్ యోనులై

మిగులుతారు

( బిహారు ఐఎ ఎస్ అధికారి శానటరీ పాడ్ అడిగిన స్కూలు లో చదివే అమ్మాయిని అవమానించిన ఘటన చదివి)

-వీరేశ్వర రావు మూల

Patna girl backs 'sanitary pad' question to Bihar IAS officer, says 'it's  serious concern of school-going girls, never got money'
ఐఏఎస్ అధికారి పొగరుగా చేసిన కండోమ్ వ్యాఖ్యాకు అవమానం పాలైన పేద విద్యార్థిని
వీరేశ్వర రావు మూల
వీరేశ్వర రావు మూల
సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles