- 6108 రోజులుగా కొనసాగుతున్న దీక్షలు
- సమస్యలు పరిష్కరించాలంటూ ప్రదర్శన
సింగరేణి లో పలు ఆనారోగ్య కారణాల రీత్యా గైర్హాహాజరై ఉద్యోగం కోల్పోయిన కార్మికులు మందమర్రి జీఎం కార్యాలయం సమీపంలో హైద్రాబాద్ నాగపూర్ రహదారి ముందు 6108 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. వారికి ఒక సదవకాశంగా ఉపాధి కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు ఆత్మహత్యలు చేసుకోగా మరికొందరు అనారోగ్యంతో మరణించారు. వయసు మీరిన మరణించిన వారి కుటుంబాలకు సహాయంగా డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలని 60 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి ఉద్యోగ వసతి కల్పించాలని వారు కోరుతున్నారు.
ఈ సందర్భముగా డిస్మిస్ కార్మికులు మంగళవారం (ఫిబ్రవరి 9)మందమర్రి సింగరేణి జీఎం కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. న్యాయ మైన తమ సమస్యకు పరిష్కారం కోరుతూ డిస్మిస్ కార్మిక సంఘం అధ్యక్షుడు రవీందర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు తెలంగాణ ఉద్యమం సందర్భంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీని మానవీయ కోణంలో పరిశీలించి అమలు చేయాలని డిస్మిస్ అయిన కార్మికులు కోరుతున్నారు. ఉద్యోగాలు లేక ఎంతో దయనీయంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా పరిష్కారం చూపాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు