Sunday, December 22, 2024

రాజకీయాల్లోనూ అసమానతలు

రాజకీయాల్లో అసమానతలు పెరుగు తున్నాయి.  భారత దేశంలోని రాజకీయాల్లో నిజాయితీపరులు కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పెట్టుబడిదారుల ప్రవేశం వల్ల అసమానతలు పెరుగుతున్నాయి.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు చైతన్యం అవసరం. సామాన్య యువత    పోటీ పెట్టుబడిదారీ రాజకీయాన్ని ఎదుర్కోలేక పోతున్నారు..నిలబడి ఉండలేక పోతున్నారు…దీనితో నయారకం నేతలు వస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలు స్టైల్ ఫ్యాషన్.. డబ్బు సంపాదించే.. పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు సంపాదించి పెట్టే ఇండస్ట్రీలు అయ్యాయి. తండ్రులు ఉన్న తనయులు..మామలున్న అల్లుళ్ళ కు వారసత్వం అయిపోయాయి.

ఇందులో కొందరు వారి టాలెంట్ ను బట్టి పైకి వచ్చేస్తున్నారు. అంతకుముందు నుంచి పార్టీ పట్టుకొని ఉన్న వారు ఆగం అయిపోతున్నారు.దేశంలో తమ బంధు మిత్రులకు లిప్ట్ ఇవ్వడంలొ ఎవ్వరు అతీతులూ కారు.. ప్రజలను కూడ ఈ విషయములో తప్పుదారి పట్టిస్తున్న దాఖలాలు ఉన్నాయ్.. రాజకీయాలు అంటె వ్యాపారము అయిపొయింది. లాభసాటిగా వుంటుంది. పెట్టుబడిదారీ సమాజంలో నివసించే జీవించేవారు తమ జీవించే హక్కుల కోసం  పో రాడుతున్న వారు  ఈ విషయాలను చాలా వివరంగా చెబుతారు.

Also Read : న్యాయవాదుల హత్య కేసులో సహకరించిన “కాపు అనిల్” అరెస్ట్

దేశానికీ స్వతంత్రము వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నీతి నిజాయితీ గా దేశంలోని సమస్త ప్రజలకు ఓకేరకం.. అంటే సమాన న్యాయము కోసం కృషి జరుగలేదు. అసమానతలు పెరుగుతున్నాయి.. పిడికెడు పెట్టుబడి దారులు మొత్తంగా దేశంలో రాజకీయాలను శాసిస్తున్నరు.పార్టీలు వారికనుసన్నల్లో పని చేస్తున్నాయి.   వేల కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకుంటారు. అందుకే  అన్నదాతలు ఎంత మొత్తుకున్నా దేశం మొత్తం ఆందోళన చెందుతున్న..వంద మంది కి పైగా ప్రాణలు కోల్పోయినా ప్రభుత్వానికి పట్టింపులేదు. ఇదొక్కటి చాలు పెట్టుబడిదారుల కోసం వారికి ఊడిగం చేయడానికి ప్రభుత్వం ఎంతకు దిగజారిందో.. ఎంత తంటాలు పడుతున్నారు మన పాలకులు అనడానికి కనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది?

అన్నదాతలను మానసికంగా..ఆర్థికంగా.. శారీరకంగా.. సామాజికంగా కేవలం ఆదాని, అంబాని లాంటి ఈ దేశాన్ని సంపదను శ్రామికులను దశాబ్దాలుగా  దోచుకుంటున్న పీల్చి పిప్పి చేస్తున్న అసమానతలను పెంచి పోషిస్తున్న వారి కుటుంబాల కోసం హింసించడం న్యాయమా.. కేంద్రంలో అధికారంలోకి బీజేపీ రావడానికి ఒక చాయ్ వాలా ప్రధాని కావడానికి కారణం అయిన వారిని నిర్లక్ష్యం చేస్తారా.. అందుకే రాజకీయాల్లో నిజాయితీగా పని చేసే వారు రావాలి.. దామాషా పద్ధతి.. రీకాల్ సిస్టమ్ ఉండాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు చేయాల్సింది మర్చిపోతే వారిని వెంటనే దింపేసే అధికారం ప్రజలకు ఉండాలి.. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం కు విరుద్ధంగా పరిపాలన సాగుతున్నది. చిత్తం వచ్చినట్లు పార్లమెంట్ లో చట్టాలు చేస్తున్నారు.. కుదిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపే వారిని న్యాయం చేయాలని.. జీవించే హక్కు కోసం పోరాడిన వారిని అరెస్టు చేసి కేసులు పెట్టడం నెలలు ఏండ్ల తరబడి జైళ్లలో పెడుతున్నారు. అన్న దాతల పైననూ ఇదే జులుం కొనసాగి స్తున్నరు.

Also Read : మహిళల చేతిలో కమండలం..

జ్యూడిషరీ పైననూ ఆధిపత్యాన్ని కొనగిస్తూ న్నారు. పౌరులు ఎవ్వరు అన్యాయాన్ని ప్రశ్నించ వద్దు..ప్రభుత్వ రంగంలో ఇంకా ఎంతకాలం సంస్థలు కొనసాగుతయో తెలియదు.ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు చేయాల్సింది గుర్తించి తక్షణమే పార్లమెంటులో అన్నదాతల పోరు పై స్పందించాలి. వారి పైన నిర్బంధాల ప్రయోగం పైన స్పందించాలి. నిజాయితీగా ..వ్యవహారించాలి.దేశం మొత్తం ఇప్పుడు ఎదురు చూస్తోంది..  అన్నదాత కు న్యాయం చేయాలని కోరుతోంది…103 రోజులు ఢిల్లీ బోర్డర్ల చుట్టూ సాగుతున్న ఉద్యమం మరింత సోమవారం భారీగా మహిళలు పాల్గోనడంతో రాజుకుంది.. ఈ నెల12 న కోల్కతా లో బీజేపీకి వ్యతిరేకంగా సభ ర్యాలీ కి రైతుసంగాలు సిద్ధం అవుతున్నాయి.

Also Read : 2035 నాటికి చైనా భూగర్భంలో రహస్య పట్టణాలు

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles