- ఇమ్రాన్ భద్రతా సలహాదారుతో చర్చలు
- కాల్పులు జరపరాదని పరస్పర అంగీకారం
- ఫలించిన దోవల్ మంత్రాంగం
- హర్షం వ్యక్తం చేసిన అమెరికా
నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించి కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్, పాక్ లు తాజాగా నిర్ణయించాయి. ఈ మేరకు డీజీఎంవో స్థాయిలో జరిగిన సమావేశంలో నిర్ణయం కీలక నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల విరమణ ద్వారా ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆకాంక్షతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరుదేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాయి. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అని ఇరు దేశాల అధికారులు తెలిపారు. ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: సామాజిక మాధ్యమాలకు ముకుతాడు
ఐక్యరాజ్యసమితి హర్షం:
కాల్పుల విరమణ పై ఇరు దేశాలు తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి హర్షం వ్యక్తచేసింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేని సమయంలో తాజాగా అంగీకారం కుదరడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దోవల్ తెర వెనుక చేసిన చర్చలవల్లే ఇది సాధ్యమైనట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్‌తో పలు మార్లు చర్చలు జరిపినట్లు సమాచార. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో లకు మాత్రమే చర్చల సారాంశం తెలుసని ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి.
కొనసాగనున్న బలగాల మోహరింపు:
మరోవైపు పరస్పర అంగీకారం కుదిరినా అక్రమ చొరబాట్లను నియంత్రించడానికి నియంత్రణ రేఖ వెంబడి బలగాల మోహరింపు కొనసాగుతూనే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ గత మూడేళ్లలో పాక్ మొత్తం 10,752 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని, ఇందులో 72 మంది భద్రతా సిబ్బంది, 70 మంది పౌరులు మరణించినట్లు ఇటీవల జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Also Read: నమ్మరాని పొరుగుదేశం చైనా
భారత్ పాక్ ఉమ్మడి ప్రకటనపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది.