- లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో తృటిలో పరాజయం
- స్మృతిమంథన, షఫేల్ వర్మ, మిథాలీరాజ్ ల అర్ధశతకాలు నిష్ఫలం
- ప్రంపంచ కప్ కోసం తలబడనున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, విస్టిండీస్
- అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాలలో చివరి బంతితో విజయం
దక్షిణాఫ్రికా చేతిలో మూడు వికెట్ల తేడాతో పోరాడి ఓడిన భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ పోటీ నుంచి వైదొలిగింది. తప్పనిసరిగా గెలవాల్సి ఉన్న లీగ్ మ్యాచ్ ను ఆదివారం నాడు ఉద్విఘ్నభరితమైన దృశ్యాలమధ్య దక్షిణాఫ్రికా చేతిలో పెట్టి జట్టు హృదయవిదారకంగా పోటీ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాట్ చేసిన భారత బ్యాటర్ల స్మృతిమంథనా, షఫాలీవర్మ, కెప్టెన్ మిథాలీరాజ్ అర్ధశతకాలు కొట్టినప్పటికీ విజయం వరించలేదు. భారత జట్టు 274 పరుగులు చేసి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని (175) దక్షిణాఫ్రికా ముందు పెట్టింది.
కానీ దక్షిణాప్రికా బ్యాటర్ల బాగా ఆడారు. బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ భారత మహిళలు అంతగా రాణించలేదు. చివరి ఓవర్ లో నాటకీయత కనిపించింది. భారత బౌలర్ దీప్తి శర్మ చివరి ఓవర్ లో దక్షిణాఫ్రకా ఏడు పరుగులు చేసి విజయం సాధించింది. అయిదో బంది విసిరినప్పుడు మిగ్నాన్ దు ప్రెజ్ బంతిని పైకి లేపగా ఫీల్డర్ పట్టుకున్నది. అపుడు ఒక బంతికి మూడు పరుగులు సాధించాల్సి ఉన్న దక్షిణాఫ్రికా ఓడిపోయే అవకాశం కనిపించింది. కానీ దీప్తి అయిదో బంతి వేసినప్పుడు హద్దు మీరి నోబాల్ వేసినట్టు అంపైర్ నిర్ణయించింది. దాంతో రెండు బంతులలో రెండు పరుగులు చేయవలసిన స్థితిలో దక్షిణాఫ్రికా నిలిచింది. చివరికి మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దు ప్రెజ్ చివరి బంతిని కొట్టి అవసరమైన పరుగులు సాధించి 52 పరుగులపై అజేయంగా నిలిచింది. మంచి ఫామ్ లో ఉన్న లారా వాల్వార్డట్, లారా గుడాల్ లు 125 పరుగులు భాగస్వామ్యం పంచుకున్నారు.
భారత్ తరఫున హర్మన్ ప్రీత్ కౌర్ 48 పరుగులు చేయడమే కాకుండా దక్షిణాఫ్రికా ఓపెనర్ లీజెల్ లీని ఆరు పరుగుల దగ్గర బౌల్ చేసి పెవెలియన్ కు పంపింది. మళ్ళీ వొల్వార్డట్ ను స్టంప్ చేసి, సునీలూస్ ను బౌల్ చేసి హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ ను తిరిగి రంగంలో ఆశావహ పరిస్థితిలో నిలిపింది. ఇండియన్ ఫీల్డింగ్ సరిగా లేదు. రాత్రిపూట మంచు కురవడంతో ఫీల్డింగ్ కష్టతరమైంది. చివరి బంతి ద్వారా సాధించిన పరుగుతో దక్షిణాఫ్రికా జట్టు అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపులో గెలుపొందింది.
లీగ్ స్థాయిలో ఆడవలసిన ఏడు మ్యాచ్ లనూ పూర్తి చేసిన తర్వాత మొదటి స్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో బ్రిటన్, నాలుగో స్థానంలో వెస్టిండీస్ నిలిచాయి. ఈ నాలుగు జట్లలో ఏదో ఒకట ప్రపంచ చాంపియన్ షిప్ గెలుచుకుంటుంది.