- రిషభ్, హార్థిక్ ,శార్దూల్ పైపైకి
- 11వ ర్యాంకులో భువనేశ్వర్ కుమార్
ఇంగ్లండ్ తో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో నిలకడగా రాణించిన భారత జూనియర్, సీనియర్ క్రికెటర్లు తమ ర్యాంకులను గణనీయంగా మెరుగుపరచుకోగలిగారు.వన్డేల్లో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొమ్మిదిస్థానాల మేర మెరుగుపరచుకొని 11వ ర్యాంకులో నిలిచాడు.గాయాలతో గత ఏడాదిగా భారతజట్టుకు దూరమైన భువీ ఇంగ్లండ్ తో టీ-20 సిరీస్ ద్వారా పునరాగమనం చేయటమే కాదు మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో అత్యుత్తమంగా రాణించాడు.నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 42 పరుగులకే 3 వికెట్లు పడగొట్టడం ద్వారా భువీ భారత విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
Also Read: మహిళా టీ-20లో భారత బుల్లెట్
13 స్థానాలు మెరుగైన శార్దూల్
పూణే ఆఖరివన్డేలో భారత్ 7 పరుగుల విజయం సాధించడంలో తనవంతు పాత్ర నిర్వర్తించిన ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ 67 పరుగులకే 4 వికెట్లు పడగొట్టడం ద్వారా తన ర్యాంకును 13 స్థానాల మేర మెరుగుపరచుకోగలిగాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ 93వ స్థానంలో ఉన్న శార్దూల్ 80వ ర్యాంకులో నిలిచాడు.
Also Read: రిషభ్ పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు
42వ ర్యాంకులో హార్థిక్…
భారత పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా 42వ ర్యాంక్ కు చేరుకోగా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ తన కెరియర్ లో తొలిసారిగా టాప్ -100లో నిలువగలిగాడు.మూడుమ్యాచ్ ల సిరీస్ లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా కెఎల్ రాహుల్ 31వ ర్యాంక్ నుంచి 27వ ర్యాంక్ కు చేరాడు.ఇంగ్లండ్ ఆటగాళ్లలో సూపర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 24, జానీ బెయిర్ స్టో 7, మోయిన్ అలీ 46 ర్యాంకుల్లో నిలిచారు.బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఆటగాళ్ళు సైతం వన్డే ర్యాంకింగ్స్ లో మెరుగైన ఫలితాలు సాధించగలిగారు.