Sunday, December 22, 2024

కళా తపస్వి శాంతారాం

  • నేడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శాంతారాం జయంతి

శాంతారాం రాజారాం వణకుద్రే (నవంబరు 18, 1901 – అక్టోబరు 30, 1990) భారత దేశపు చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన అద్భుత చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు.  వి. శాంతారామ్ గా ప్రసిద్ధుడు. ఆయన ఒక కళా తపస్వి. శాంతారామ్ దాదాపు ఏడు దశాబ్దాలుగా చిత్రనిర్మాతగా కృషి చేసి చలనచిత్ర మాధ్యమాన్ని సాంఘిక మార్పునకు  సాధనంగా వినియోగించు కోవడానికి ప్రయత్నం చేశారు. ప్రారంభ చిత్రనిర్మాతలలో ఆయన  ఒక వైపు మానవతా వాదాన్ని సమర్థించడానికి, మరోవైపు మూర్ఖత్వాన్నీ, అన్యాయాన్నీ బహిర్గతం చేయడానికి చిత్రాలను విజయవంతంగా ఉపయోగించారు.

సందేశాత్మక చిత్ర దర్శకుడు

ఆయన “డా.కోట్నిస్ కీ అమర్ కహానీ” (1946), “అమర్ భూపాలి” (1951), “దో ఆంఖె బారహ్ హాథ్” (1957), “నవరంగ్” (1959), “దునియా నా మానే” (1937), “పింజ్రా” (1972) వంటి చిత్రాలతో అందరికి పరిచితుడు. ఆయన తీసిన చిత్రాలన్నీ ఆణిముత్యాలే. ప్రతీ చిత్రంలో ఎదో ఒక కళకు ప్రాముఖ్యత ఇచ్చి నిర్మించారు’ ఝనక్ ఝనక్ పాయల్ బాజేలో’ నృత్యానికి, ‘నవరంగ్’ లో కవిత్వానికి, ‘గీత్ గాయా పత్తరోన్’ చిత్రంలో (తెలుగులో ‘అమరశిల్పి జక్కన’ చిత్రానికి ఆధారం. సాంఘిక చిత్రంగా మలిచారు) శిల్పానికి, ఇలా ఎన్నో కళలని దృశ్య కావ్యాలుగా మనకి అందించారు. వారి చిత్రాలలో పాటలు అమృత గుళికలు. ‘జల్ బిన్ మచిలీ’ చిత్రంలో ఒక పాము డాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది మన తెలుగుచిత్రం ‘అగ్నిపూలు’ లో జయప్రద చేశారు. అంతే కాదు వారి చిత్రాలు సందేశాత్మకంగా ఉండి ప్రజలని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఉదాహరణకి ‘తూఫాన్ అవుర్ దియా’ చిత్రంలో ఎన్నికష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడాలని, ‘దో ఆంఖేన్ బారాహాత్’ చిత్రంలో మంచితనంతో ఎంత దుర్మార్గులనైనా మార్చవచ్చనీ, ‘సుభా క తారా’ చిత్రంలో వితంతు వివాహ సంస్కరణ గురించి చెప్పారు. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలు ఆయన దర్శకత్వంలో  వెలువడ్డాయి.

Indian filmmaker Shantaram birth anniversary

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

డా వి.శాంతారామ్ ‌మహారాష్టల్రోని కొల్హాపూర్‌కు సమీప గ్రామంలో 18 నవంబర్ 1901న జన్మించారు. 1921లో నటుడిగా చిత్ర రంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించారు. సుమారు 90 సినిమాలు నిర్మించారు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించారు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచారు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్ర్తీ, అమర్‌ భూపాలీ, డా కోట్నిస్‌ కీ అమర్‌ కహానీ మొదలగు సినిమాలు శాంతారామ్‌ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్‌, గీత్‌ గాయా పత్థరోంనే, ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే మొ చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించారు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ… 1985లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డును బహూకరించింది.

ఉత్తమ దర్శకుడికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు (1957); పద్మ విభూషణ్; నాగపూర్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ పొందిన ఆయన 18 అక్టోబరు 1990 న మరణించారు.

Related Articles

3 COMMENTS

  1. మన దేశం గర్వించదగిన దర్శక నట దిగ్గజం వి. శాంతారాం గురించి చాలా చక్కగా రాశారు.. ధన్యవాదాలు సర్..
    ఇకపోతే నాకు తెలిసినంతలో దో ఆంఖే బారా హాత్ తెలుగులో కూడా ఎన్టీఆర్ హీరోగా వచ్చినట్లు జ్ఞాపకం.. చాలారోజుల క్రితం చూశాను గనుక సమయానికి పేరు గుర్తు రావడంలేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles