- రాణించిన విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్
- ఒకే ఒక బంతి ఉందనగా హార్థిక్ పాండ్యా బౌండరీతో లక్ష్యం ఛేదన
విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ ల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా ఇండియా మూడో టి-20 మ్యాచ్ లో గెలుపొంది సిరీస్ సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా గెలుపొందగా, రెండు, మూడు మ్యాచ్ లను ఇండియా గెలుచుకొని 2-1 స్కోరుతో విజయం సాధించింది.
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడవ, చివరి మ్యాచ్ లో ఒక బంతి ఉందనగా హార్దిక్ పాండ్యా బౌండరీ కొట్టిన ఫలితంగా ఇండియా విజయం సాధించింది. చివరి నిమిషంలో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించింది.
ముందు ఓపెనర్ ఒకే ఒక్క పరుగు తీసి పెవెలియన్ కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండో ఓపెనర్, జట్టు నాయకుడు రోహిత్ శర్మ దూకుడుగా ఆడి 17 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ లు నిలకడగా ఆడి 104 భాగస్వామ్యం సాధించారు. కొహ్లీ 63 పరుగులు చేసి చివరి ఓవర్ లో అవుటవగా, సూర్యకుమార్ యాదవ్ 69 పరుగులు చేసి అంతకు ముందే అవుటైనాడు. కొహ్లీ వికెట్ పడిపోయిన తర్వాత వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ వచ్చి సింగిల్ తీసుకొని స్ట్రయికింగ్ హార్దిక్ పాండ్యా గట్టెక్కించాడు. 187 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్ల నష్టానికి ఇంకా ఒక బంతి మిగిలి ఉన్న దశలో సాధించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో డేనియల్ శామ్స్ రెండు వికెట్లు, సోష్ హేజెల్ వుడ్,ప్యాట్ కమ్మిన్స్ చెరో వికెట్టు తీసుకున్నారు.
అంతకు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ 54 పరుగులు ధాటిగా ఆడి సాధించాడు. కేమరిన్ గ్రీన్ 21 బంతులలోనే 52 పరుగులు చేశాడు. అక్సర్ పటేల్ 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకొని మరోసారి రాణించాడు. హర్షల్ పటేల్ ఒకటి, భువనేశ్వర్ కుమార్ ఒకటి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.