- పృథ్వీ షా, నవదీప్ సైనీల పై వేటు
- ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్`
భారత్ వేదికగా ఇంగ్లండ్ తో ఫిబ్రవరి 5 నుంచి జరిగే నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే 18మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది.
ఆస్ట్రేలియా గడ్డపై భారతజట్టు టెస్ట్ సిరీస్ నెగ్గిన రోజునే …ఇంగ్లండ్ తో సిరీస్ కు జట్టును ప్రకటించడం విశేషం. పితృత్వపు సెలవు మీద భారతజట్టు ఆడిన గత మూడుటెస్టులకు దూరమైన కెప్టెన్ విరాట్ కొహ్లీ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. గాయాలతో ఆస్ట్ర్రేలియా పర్యటనకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాలకు సైతం తిరిగి జట్టులో చోటు కల్పించారు. అయితే…ఆస్ట్రేలియా టూర్ లో పాల్గొని రాణించడంలో విఫలమైన ఓపెనర్ పృథ్వీ షా, ఓపెనింగ్ బౌలర్ నవదీప్ సైనీ జట్టులో చోటు నిలుపుకోలేకపోయారు.
Also Read : భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర
గాయాలతో జట్టుకు దూరమైన మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ లకు సైతం ఎంపిక సంఘం విశ్రాంతినిచ్చింది.
ముగ్గురు ఓపెనర్లు
చెన్నై, అహ్మదాబాద్ వేదికలుగా జరిగే మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనే 18 మంది సభ్యులజట్టులో ముగ్గురు ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్ లకు అవకాశమిచ్చారు. మిడిలార్డర్లో చతేశ్వర్ పూజారా, విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, ఆల్ రౌండర్లు హార్థిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ఉన్నారు.
Also Read : ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం
పేస్ బౌలింగ్ విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అశ్విన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ కెఎల్ రాహుల్…ఫిట్ నెస్ నిరూపించుకొంటే…జట్టుతో కొనసాగే అవకాశం కల్పించారు. స్టాండ్ బైస్ గా కెఎస్ భరత్, అభిమన్య ఈశ్వరన్, ప్రియాంక్ పంచాల్, షాబాజ్ నదీం, రాహుల్ చాహర్ ఎంపికయ్యారు.
నెట్ బౌలర్లుగా అంకిత్ రాజ్ పుట్, ఆవేశ్ ఖాన్, సందీప్ వారియర్, గౌతమ్, సౌరవ్ కుమార్ లకు అవకాశమిచ్చారు. నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టులు చెన్నై చెపాక్ స్టేడియంలోనూ, మూడు, నాలుగు టెస్టులు అహ్మదాబాద్ స్టేడియం వేదికగాను నిర్వహిస్తారు.
Also Read : టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ గా భారత్